వరుణ్ ధావన్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో ‘స్త్రీ’ సినిమా తెరకెక్కించిన అమర్ కౌశిక్, మరోసారి కాస్త అలాంటి జానర్‌లోనే తెరకెక్కించిన సినిమా ‘తోడేలు’. హిందీలో ‘భేడియా’గా విడుదలైంది. మరి ఇది ప్రేక్షకులను ఆకట్టుకుందా?
భాస్కర్ అలియాజ్ భాస్కి(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘జైరో’ అడవిలో ఓ రోడ్డు కాంట్రాక్టు తీసుకుంటాడు. తన దగ్గర ఉన్నదంతా దారపోసి ప్రాజెక్ట్ తీసుకుంటాడు. అయితే ఆ అడవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలు రోడ్డు వేయడానికి ఒప్పుకోరు.
కథ:
వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగానే..భాస్కిని అడవిలో ఓ వింత జంతువు కరుస్తుంది. ఆ తర్వాత రోడ్డు పనులకు సహకరిస్తున్న ఒక్కొక్కరు చనిపోతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ
హారర్- కామెడీ జానర్‌లో అమర్ కౌశిక్ సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాలో ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధి, ఈశాన్య ప్రజలపై ఇతర ప్రాంతాలు చూపే వివక్ష ఇవన్నీ తన సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
ఎలా ఉంది?
తొలి అర్ధభాగంలో కామెడీ చాలా బాగా పండింది. హారర్ కన్నా దర్శకుడు కామెడీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే సీటులో ఒక్కసారిగా వణికించే సీన్లు కూడా ఉన్నాయి
హారర్ సీన్స్ బాగా పండటంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా దోహదపడింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అరుణాచల్ ప్రదేశ్ అడవులు, పున్నమి రాత్రి ఇలాంటివి చాలా చక్కగా చూపించారు
వరుణ్ ధావన్ తోడేలుగా మారే సీన్లలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ సీన్లలో వరుణ్ ధావన్ నటన అద్భుతం. కామెడీ సీన్లు ఎంత చక్కగా చేశాడో.. ఈ సీన్లను కూడా అంతే బాగా చేశాడు
హీరోతో పాటు ఉండే అతడి స్నేహితుల క్యారెక్టర్లలో నటించినవారు చాలా బాగా చేశారు. జనార్దన్ క్యారెక్టర్ కామెడీ బాగా పేలింది. సీరియస్ సీన్లలో కూడా జనార్దన్ పంచులు నవ్వు తెప్పిస్తాయి
అమర్ కౌశిక్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంటరెస్టింగ్‌గా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ విభాగం కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది
పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. డార్క్ కలర్ థీమ్‌తో నడిచే సినిమాలో ఇందులో ఏది బాగా లేకున్నా సినిమా క్వాలిటీ తగ్గేది కానీ బాగానే మేనేజ్ చేశారు
కథ, కథా నేపథ్యంకామెడీవిజువల్ ఎఫెక్ట్స్బ్యాక్గ్రౌండ్ స్కోర్సినిమాటోగ్రఫీ
బలాలు
బలహీనతలు
సెకండాఫ్‌లో సాగదీత కథనంభావోద్వేగాలు అంతగా పండకపోవడం
రేటింగ్: 3
హారర్-కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి ఓ సందేశంతో కూడిన సినిమా ‘తోడేలు’. ఫ్యామిలీతో వెళ్లేవారు పిల్లలతో కలిసి వెళ్తే ఎంజాయ్ చేస్తారు