న్యూఇయర్‌ వేడుకల్లో టాలీవుడ్‌ హీరోలు.. ఎవరేవరూ ఏం చేశారంటే?

YouSay Short News App

కొత్త సంవత్సరం వేడుకలను టాలీవుడ్‌ హీరోలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. విదేశాలతో పాటు హైదరాబాద్‌లోనూ సందడి చేశారు. ఎవరెక్కడా  ఏం చేశారో చూద్దామా?

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వా మెగా హీరోలతో న్యూ ఇయర్ జరుపుకున్నాడు. చిరంజీవి, రామ్‌ చరణ‌్‌తో సరదాగా గడిపిన ఫొటోలను షేర్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు.

శర్వానంద్‌

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ న్యూ ఇయర్ వేడుకలకు తగ్గేదే లే అంటూ గోవాలో ఎంజాయ్ చేశాడు.  భార్య స్నేహా రెడ్డితో కలిసి సరాదాగా గడిపారు. మరికొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

అల్లు అర్జున్

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మాల్దీవ్స్‌లో షాంపైన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. అది రష్మికతో వెళ్లినప్పటిదంటూ నెటిజన్లు పెట్టిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

విజయ్ దేవరకొండ

జూనియర్ ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు న్యూయార్క్‌లో జరుపుకున్నాడట. ఇందుకోసమే వారం క్రితమే అక్కడికి వెళ్లిపోయాడని టాక్.

జూనియర్ ఎన్టీఆర్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ఫ్యామిలీ అందరితో కలిసి లండన్‌ వెళ్లాడు. కొత్త సంవత్సరానికి స్నేహితులు, బంధువుల మధ్య స్వాగతం పలికారు.

మహేశ్‌ బాబు

దుబాయ్‌లో నాగార్జున, అమల నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి  న్యూ ఇయర్‌ను వెలుగుల మధ్య ఆహ్వానించారు.

నాగార్జున

పాన్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. కేక్‌ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.

నిఖిల్

హీరో వరుణ్ తేజ్ సోలోగానే న్యూ ఇయర్ ఎంజాయ్ చేశాడు. విదేశాలకు వెళ్లిన ఈ కుర్ర హీరో తన ఫొటోగ్రఫీకి పదునుపెట్టాడు.

వరుణ్ తేజ్‌

కొత్త సంవత్సరం రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతదూరం వచ్చానో అర్థం అవుతుందన్నాడు యశ్. కాఫీ కప్‌తో ఆహ్వానం పలుకుతున్న ఫోటో పోస్ట్ చేశాడు.

యశ్‌

హీరో కార్తీ విదేశాల్లో న్యూఇయర్ సంబరాలు చేసుకున్నాడు. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశాడు.

కార్తీ