2022లో టాలీవుడ్‌లో ఊపుతెచ్చిన సందర్భాలు

YouSay Short News App

టాలీవుడ్‌లో ఈ ఏడాది కొన్ని సంచలనాలు నమోదయ్యాయి. పాత సినిమాలు 4K కి మార్చి విడుదల చేయటం. మల్టీ స్టారర్‌లకు హీరోలు వరుస కట్టడం. డీజే టిల్లు డిక్షన్‌తో.. ఎన్టీఆర్‌ కొమురం భీముడో పాటతో ఊపు ఊపేయడం. కుర్ర హీరోలతో బాలయ్య అన్‌స్టాపబుల్ ముచ్చట్లు. ఇలా ఎన్నో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

ఈ ఏడాది ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో మల్టీ స్టారర్ ట్రెండ్ మెుదలైతే దాన్ని మిగతా హీరోలు కొనసాగిస్తున్నారు. ఎవ్వరితోనైనా నటించేందుకు సై అంటున్నారు. రానాతో వెంకటేశ్ వెబ్ సిరీస్‌లో నటించగా… ఇప్పటికే టీజర్ విడుదలయ్యింది. ఓరి దేవుడా చిత్రంలో కూడా గెస్ట్ అప్పియరన్స్ చేశాడు.

మల్టీ స్టారర్‌ ట్రెండ్‌

చిత్ర పరిశ్రమలో మరో కాంబినేషన్ కూడా రాబోతుంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటిస్తున్నాడు. అంతేకాదు, పవన్ సాయిధరమ్ తేజ్‌ కాంబో ఊహాగానాలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలు మళ్లీ తెరపై చూడాలని ఉంటుంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో జల్సా, ఒక్కడు, ఖుషీ వంటి సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాలకు థియేటర్లలో ప్యాన్స్‌ది మాములు హంగామా కాదు.

పాత సినిమాలు కొత్తగా

ఆర్ఆర్‌ఆర్ చిత్రంలోని ఈ పాట ఓ సెన్సెషన్. సినిమా విడుదల తర్వాత ఎవ్వరి నోట విన్నా ఇదే పాట. ఇందులో ఎన్టీఆర్‌ నటనకు అంతలా పేరు వచ్చింది మరి.

కొమురం భీముడో

ఈ ఏడాది మెుత్తం డీజే టిల్లు ఫీవర్ నడించింది. ఎక్కడ విన్నా సిద్ధూ జొన్నల గడ్డ డిక్షన్‌లో చెప్పిన మాటలే వినిపించాయి. నువ్వు నన్ను నిజంగానే ఈ మాట అడుగుతున్నావా రాధిక అని ఎంతమంది చెప్పి ఉంటారో లెక్క లేదు.

డీజే టిల్లు డైలాగ్స్‌

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ టీజర్‌ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను అదేస్థాయిలో నిరాశపర్చింది. ఓం రౌత్‌పై ట్రోల్స్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి.

ఆగం చేసిన ఆదిపురుష్

ఆదిపురుష్‌ టీజర్‌ విమర్శలకు గురవుతున్న వేళ కొద్ది రోజులకే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ టీజర్ వచ్చింది. ఇందులో గ్రాఫిక్స్‌ ఆదిపురుష్ కంటే బాగున్నాయని జనాలు పోలిక పెట్టడం మెుదలుపెట్టారు. కోట్లు ఖర్చు చేసి తీసింది గ్రాఫిక్స్‌లా కనిపించాయని ట్రోల్స్ వచ్చాయి.  ఇది ఓ సెన్సెషన్‌.

ఆదిపురుష్‌తో పోలిక

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఇన్నింగ్స్‌ గుర్తుందా? అదేలా మర్చిపోతారు? కింగ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎలా చేశాడో. ఫ్యాన్స్‌ కూడా అదేస్థాయిలో పండగ జరిపారు. బాలయ్య వీర సింహా రెడ్డి గెటప్‌లో పోస్టులు పెట్టి హల్‌ చల్‌ చేశారు.

వీర సింహా రెడ్డి గెటప్‌లో కోహ్లీ

కార్తీ నటించిన యుగానికి ఒక్కడు చిత్రంలోని డైలాగ్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట మార్మోగింది. ఎంతలా అంటే కార్తీ తన సర్దార్‌ సినిమా ప్రమోషన్లలో ఈ డైలాగ్ చెప్పి ఎంత పాపులర్‌ అయ్యిందో మాట్లాడారు.

ఎవర్రా మీరంతా

పవన్ కల్యాణ్ రీమేక్‌లకు పెట్టింది పేరు. కొద్ది రోజుల క్రితం హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో థేరీ రీమేక్ చేస్తారని టాక్ నడించింది. దీంతో రెండ్రోజుల పాటు నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపించారు. దీంతో దెబ్బకు ఉస్తాద్ భగత్ సింగ్, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చిత్రబృందం టైటిల్ రిలీజ్ చేసింది.

మనల్ని ఏవడ్రా ఆపేది

అన్‌స్టాపబుల్‌ 2తో మరోసారి సెన్సెషన్‌గా మారారు బాలయ్య. కుర్రహీరోలను ఆటపట్టిస్తూ సరదా ప్రశ్నలు అడుగుతూ అందరి సరదా తీర్చేశారు. ప్రభాస్‌తో వచ్చిన టీజర్‌ అయితే సోషల్‌ మీడియాలో హంగామా సృష్టించింది.. తర్వాత పవర్‌ స్టార్‌తో షూట్ చేయబోతున్నాడు. మరీ ఎలా ఉంటుందో చూడాలి.

బాలయ్యను ఆపగలరా

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.