TOLLYWOOD ITEM SONGS: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చేసిన టాప్ 10 ఐటెం సాంగ్స్ ఇవే…
YouSay Short News App
తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లకు ఉండే క్రేజ్ వేరు. ఐటెమ్ సాంగ్స్ అంటే సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, ముమైత్ ఖాన్‌లే చేసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.
కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు ఐటెం సాంగ్ చేయడానికి ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు. ఐటెం సాంగ్స్ చేస్తే ఐటెం గర్ల్‌గా ముద్ర వేస్తారనే అనుమానాలు ఉండేది.
అయితే, ఐటెం సాంగ్ వల్ల భారీగా పారితోషికం లభించడంతో పాటు తక్కువ కాలంలోనే క్రేజ్ వచ్చేస్తుంది. ఈ అడ్వాంటేజ్‌ని చాలామంది స్టార్ హీరోయిన్లు క్యాష్ చేసుకుంటున్నారు.
హీరోయిన్ ఇమేజీని పక్కన పెట్టి మరీ కొందరు ఐటెం సాంగ్స్‌లో ఆడిపాడారు. మరింత క్రేజ్‌ని పెంచుకున్నారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు? వారి చేసిన ఐటెం సాంగ్స్ ఏంటో చూద్దాం.
సమంత - పుష్ప
పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా’ పాటతో సమంత ఐటం గర్ల్‌గా ఆడిపాడింది. బన్నీకి పోటీగా స్టెప్పులు వేస్తూనే అందాల విందు చేసింది. ఈ పాట అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.
పూజా హెగ్డే- రంగస్థలం
రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’గా పూజా స్టెప్పులేసింది. దీంతో పూజా హెగ్డే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ఈ పాటకు బాగానే పారితోషికం పుచ్చుకుందట.
తమన్నా- జై లవకుశ
మిల్కీ బ్యూటీ తమన్నా పలు ఐటెం సాంగ్స్‌లలో తన హాట్ అందాలను చూపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో ‘స్వింగ్ జర’ పాటలో ఆడిపాడింది. మత్తెక్కించే ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారులో నిషా నింపింది. అల్లుడు శీనులోనూ ఐటెం సాంగ్ చేసింది.
కాజల్ - జనతా గ్యారేజ్
చందమామ బ్యూటీ కాజల్ ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేసింది. ‘నేను పక్కా లోకల్’ అంటూ నాటు అందాలతో ఘాటెక్కించింది. ఈ పాట మార్మోగిపోయింది.