డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాను అత్యద్భుతంగా తీశాడు. కథ, కథనం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో నటించిన నటీనటులందరూ వారి పాత్రలకు జీవం పోశారు.
రంగస్థలం(2018) - ప్రైమ్ వీడియో
పరువు హత్యలు, అధికార దాహం, కుల, వర్గ దురాభిమానం గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ సినిమా చూసిన తర్వాత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.
‘1940లో ఒక గ్రామం’ 2010లో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. పితృస్వామ్యం నేపథ్యంలో సాగే ఈ కథ అప్పట్లో ఉండే పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
1940లో ఒక గ్రామం(2010) - యూట్యూబ్
తమకు నచ్చిన వాడిని వివాహం చేసుకోలేక స్త్రీలు ఎంతటి వేదనకు గురయ్యేవారో మనకు కనిపిస్తుంది. 1940లలో మహిళల స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఇది తప్పక చూడాల్సిన సినిమా.
నిజ జీవిత కథనాల ఆధారంగా ‘కేరాఫ్ కంచరపాలెం’ మూవీని డైరెక్టర్ వెంకటేశ్ మహా నిర్మించారు. సినిమా మొత్తం రాజు అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. రాజు అనే వ్యక్తి 40 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు.
కేరాఫ్ కంచరపాలెం(2018) - ప్రైమ్ వీడియో
కులం, మత అసహనం, స్వేచ్ఛ, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అద్భుతమైన సాహిత్యంతో ఈ సినిమా కూడా మిమ్మల్ని తప్పక అలరిస్తుంది.
సినీ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ప్రయత్నాల్లో ‘పలాస 1978’ ఒకటి. అగ్ర కులాలు చూపించే కుల వివక్షను ఈ చిత్రంలో చూపించారు.
పలాస 1978 (2020) -ప్రైమ్ వీడియో
సమాజంలో నెలకొన్న అన్యాయం, అసమానతలు, కుల రాజకీయాలను దర్శకుడు కరుణ కుమార్ చక్కగా తెరకెక్కించారు.
రాజేంద్రప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఈ సినిమా రఘురామయ్య అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. డబ్బు కంటే ప్రేమ, జాలి, దయ ముఖ్యమని ఆయన నమ్ముతాడు.
ఆ నలుగురు (2004) -యూట్యూబ్
రఘురామయ్య సంపాదించిన దాంట్లో సగం పేదలకే పంచుతాడు. ఆయన అవినీతి వ్యతిరేకి. ఇది తన కుటుంబసభ్యులకు నచ్చదు. చివరకు ఆయన కూడా బ్యాంకుల్లో అప్పులు చేసి.. ఆత్మహత్యకు పాల్పడతాడు. మనిషి చనిపోయాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడంలో దర్శకుడి పనితీరును మెచ్చుకోవాల్సిందే.