క్రికెటర్ల మనసు దోచి...  మనువాడిన ముద్దుగుమ్మలు వీరే!

YouSay short news App

వెస్టిండీస్ భీకర ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్‌ని తన అందంతో పడేసిన అమెరికా మోడల్ జస్సిమ్ లోరా. 2016లో వీరిద్దరికీ వివాహమైంది. వీరికి కూతురు ఉంది.

జస్సిం లోరా w/o ఆండ్రూ రస్సెల్

అయితే, ఈ మోడల్‌కి సోషల్ మీడియా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు.

అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ‘అనుష్క శర్మ’. ఈ బాలీవుడ్ నటికి ముందు నుంచే అశేష అభిమానులున్నారు. కోహ్లీని ప్రేమించి 2017లో పెళ్లిచేసుకుంది.

అనుష్క శర్మ w/o విరాట్ కోహ్లీ

విరుష్క జంటకు ముద్దుల కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలు చేయడం తగ్గించింది.

క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని పొందిన మరో క్రికెటర్ భార్య ‘సఫా బేగ్’. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సఫా బేగ్‌కి 2016లో నిఖా జరిగింది.

సఫా బేగ్ w/o ఇర్ఫాన్ పఠాన్

ఎప్పుడూ హిజాబ్ వేసుకుని లేదా మాస్క్ ధరించి  కనిపిస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు.

తన అందచందాలతో బాలీవుడ్ నటి సాగరికా ఘట్గే అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. 2017లో టీమిండియా స్వింగ్ మాస్టర్ జహీర్ ఖాన్‌ని మనువాడింది.

సాగరికా ఘట్గే w/o జహీర్ ఖాన్

ఈమెకు సోషల్ మీడియాలో మంచి  ఫాలోయింగ్ ఉంది.

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాది ఎల్లలు దాటిన ప్రేమ కథ. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకుంది. 2010లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

సానియా మీర్జా w/o షోయబ్ మాలిక్

అయితే, భారత్‌లో సానియాకు వీరాభిమానులు ఉన్నారు. ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచికి తన అందం తోడయింది. ఈ టెన్నిస్ స్టార్‌కి సోషల్ మీడియాలోనూ గొప్ప ఫాలోయింగ్ ఉంది.

భారత ఉపఖండంలో తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న మరో వనిత ‘ఉమ్మే అహ్మద్ శిశిర్’. నెం.1 ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య.

ఉమ్మే అహ్మద్ శిశిర్ w/o షకిబ్ అల్ హసన్

11ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.  వీరి అనుబంధానికి ప్రతిరూపంగా ఒక కుమారుడు జన్మించాడు.

క్రీడా వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి ‘సంజనా గణేషన్’. మాటలతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతో టీమిండియా పేసర్ బుమ్రాని బౌల్డ్ చేసింది. 2021లో వీరిద్దరికీ పెళ్లయింది.

సంజనా గణేషన్ w/o జస్ప్రిత్ బుమ్రా

సంజనా గణేషన్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు.