జూ.NTR గురించి మీకు తెలియని టాప్ 20 విషయాలు

YouSay Short News App

RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా జూ.ఎన్టీఆర్ ఎదిగారు. ఆస్కార్ ఉత్తమ నటుడి ఆవార్డుల రేస్‌లోనూJr.NTR అగ్రస్థానంలో నిలిచాడు.  ఈ క్రమంలో అంతర్జాతీయ సినీ ఇండస్ట్రీ పెద్దల దృష్టి ఎన్టీఆర్‌పై పడింది.

ఈ నేపథ్యంలో Jr.NTR గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం..

ఎన్టీఆర్ మొదటి పేరు తారక్.. తన అంశతో ఉన్నాడని ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్‌ అని నామకరణం చేశారు.

Jr.NTR అసలు పేరు?

జూ.ఎన్టీఆర్ తన తాత NTR డైరెక్షన్‌లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర  సినిమాలో బాల భరతుడిగా నటించారు.

తారక్ తొలి సినిమా?

నిన్నుచూడాలని చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు గాను మూడున్నర లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడు.

Jr.NTR తొలి పారితోషికం?

కూచిపూడిని నాలుగు ఏళ్ల పాటు నేర్చుకున్నారు.  ఈ సాధననే టాలీవుడ్‌లో నంబర్ 1 డ్యాన్సర్‌గా Jr.NTRను నిలబెట్టింది.

కూచిపూడిలో ప్రావీణ్యం

జూనియర్ ఎన్టీఆర్  వరుసగా రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెం. 1 (2001), సింహాద్రి (2003)వద్ద బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి.  ఈ విజయాలు టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేశాయి.

తారక్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్?

క్రికెట్ అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టం. సమయం దొరికితే బ్యాట్ పట్టి బంతులను బౌండరీలు దాటిస్తాడు.

Jr.NTRకు ఇష్టమైన ఆట?

నాటు కోడి పులుసు అంటే ఎన్టీఆర్‌కు ప్రాణం. దానిని దోరగా కాల్చి ఉప్పు, కారం, మసాల దట్టించే వండితే ఆమోఘం అంటూ ఎన్టీఆర్ చెప్పాడు. రోయ్యల బిర్యానీ కూడా ఆయనకు ఇష్టం

Jr.NTRకు ఇష్టమైన ఫుడ్?

ఎన్టీఆర్ గరిట పడితే సూపర్‌గా వంట చేస్తాడు. ఖాళీ సమయాల్లో తన భార్య ప్రణతికి ఇష్టమైన డిషెస్ వండి వడ్డిస్తాడు.

NTR వంట చేస్తాడా?

ఎన్టీఆర్ తన తాతను గురువుగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా అయితే.. జగ్గివాస్‌దేవ్‌ను సద్గురుగా పిలుస్తారు.

Jr.NTR గురువు?

మార్చి 26, 2009ని తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని Jr.NTR చెబుతుంటారు. ఆరోజు కారు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఆరోజు తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా.

Jr.NTR మరిచిపోలేని రోజు?

దానవీరశూర కర్ణ

Jr.NTRకు నచ్చిన సినిమా?

దివంగత నటి శ్రీదేవి అంటే ఆయనకు ఇష్టం

Jr.NTRకు నచ్చిన హీరోయిన్?

తెలుపు అంటే ఎన్టీఆర్‌కు ఇష్టం

తారక్ ఇష్టమైన రంగు?

9 నంబర్ అంటే తారక్‌కు ఇష్టం. NTR అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ 9999.  BMW 7 సిరీస్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం 10.5 లక్షలు చెల్లించాడు, ఇది తెలంగాణలో కారు నంబర్ కోసం చెల్లించిన అత్యధిక మొత్తం.

Jr.NTR లక్కీ నంబర్?

మాతృదేవోభవ సినిమాలోని 'రాలిపోయే పువ్వా' సాంగ్ అంటే ఎన్టీఆర్‌కు ఇష్టం. ఈ పాటను కీరవాణి తారక్‌కు అంకితం ఇచ్చాడు.

తారక్‌కు ఇష్టమైన పాట?

నాన్నకు ప్రేమతో పాటు పలు సినిమాల్లో Jr.NTR పాటలు పాడాడు. చక్రవ్యూహ కన్నడ చిత్రంలో "గెలేయా గెలేయా" అనే పాటను ఆలపించాడు.

Jr.NTRకు సింగర్‌గా ప్రావీణ్యం?

Jr NTR ఇప్పటి వరకు 31 చిత్రాల్లో నటించారు. హీరోగా 29 చిత్రాల్లో నటించారు.

Jr NTR హీరోగా ఎన్ని చిత్రాలు?

ఇద్దరు కుమారులు..అభయ్ రామ్, భార్గవ్ రామ్‌

తారక్‌కు ఎంతమంది పిల్లలు?

1983 మే 20న నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు.

తారక్ పుట్టిన తేదీ?

ఉత్తమ నటుడుగా రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌పేర్, IIFA 2017 అవార్డు పొందాడు.

Jr NTR అవార్డులు?

పోర్బ్‌ ఇండియా సెలబ్రెటీస్ జాబితాకు తారక్ రెండు(2012,2016) సార్లు ఎంపికయ్యారు

పోర్బ్స్‌లో రెండు సార్లు

హైదరాబాద్-జూబ్లీహిల్స్, వెంకటగిరి రోడ్ 29లో రూ.25 కోట్లతో ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించుకున్నారు. అత్యాధునిక ఇంటీరియర్, వాస్తు కళారీతులతో Jr Jr.NTR ఇళ్లు ఉంటుంది.

తారక్ నివాసం?

జపాన్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు నటుడు. బాద్షా (2013) జపనీస్ భాషలో డబ్ చేయబడిన తర్వాత జపాన్‌లో జరిగిన చలన చిత్రోత్సవానికి నామినేట్ చేయబడింది. RRR మూవీతో అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.

జపాన్‌ ఫ్యాన్ ఫాలోయింగ్

పలు అంతర్జాతీయ మీడియా కథనాలు ఆస్కార్ - ఉత్తమ నటుడు అవార్డు పొందే అవకాశం ఎన్టీఆర్‌కు ఉందని తెలిపాయి. Jr.NTR ఆస్కార్ అవార్డు పొంది భారత చలన చిత్ర ప్రతిష్టను మరింత విస్తరించాలని YouSay కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Jr.NTRకు ఆస్కార్ వస్తుందా?