సమాజాన్ని తట్టి లేపే  టాప్- 5 తెలుగు చిత్రాలు

YouSay Short News App

పిల్లలు విదేశాలకు వెళ్లడంతో భార్యాభర్తలు పల్లెటూరులో ఎలా గడిపారనేదే ఈ చిత్రం కథ.  ఈ చిత్రంలోని సున్నితమైన, భావోద్వేగం సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

మిథునం (2012) - ప్రైమ్ వీడియో

ఎస్పీ బాలు, లక్ష్మీ వారి వారి పాత్రల్లో జీవించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, దర్శకుడి ప్రతిభ, కెమెరామెన్ పనితీరు మిమ్మల్ని ఉర్రూతలూగిస్తాయి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకుండా వదలొద్దు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘వేదం’ ఒకటి. ఈ చిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి. సంగీత విద్వాంసుడు వివేక్ చక్రవర్తి, పేదవాడు కేబుల్ రాజు, వ్యభిచారి సరోజ, పేద నేతన్న నాగయ్య పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది.

వేదం (2010) - ఆహా వీడియో

చివరికి వీరందరి కథలు ఒకే దగ్గరకు వస్తాయి. ధనదాహం, అభిరుచి, విద్య, బానిసత్వం, అవినీతి సమస్యలపై ఈ చిత్రం మెసేజ్ అందిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టాల్సిందే.

’జెర్సీ‘ సినిమా క్రికెట్‌కు మించి ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో అర్జున్‌గా నటించాడు. అర్జున్ తను కోరుకున్న రంగంలో రాణించాడా లేదా అన్నదే  ఈ చిత్రం కథ.

జెర్సీ (2019) -హాట్‌స్టార్

36 ఏళ్ల వయసులో అర్జున్ తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టడం, అతనికి ఎదురైన సవాళ్లు, ఆర్థిక కష్టాలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధం గురించి కూడా తెలుపుతుంది. ఈ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.

మహిళలకు శ్రమ లేకుండా నేత యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లేశం జీవితం ఆధారంగా‌ ఈ సినిమా నిర్మించారు. కానీ అతని జీవితంలో ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదురవుతాయి.

మల్లేశం (2019) -నెట్‌ఫ్లిక్స్

తన తల్లి కోసం, మహిళల కోసం ఆటోమేటిక్ నేత యంత్రాన్ని తయారు చేస్తాడు. ఫస్టాఫ్‌లో ఈ సినిమా కామెడీగా ఉన్నా.. సెకండాఫ్‌లో గంభీరంగా సాగుతుంది. ఈ సినిమా నిజ జీవితంలో మల్లేశం చేనేత రంగంలో తెచ్చిన విప్లవాన్ని తెలుపుతుంది. ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా ఇది నిలుస్తుంది.

ఈ సినిమాలు కూడా చూడదగినవే

కంచె

నేనింతే

ఈ సినిమాలు కూడా చూడదగినవే

ఎవడే సుబ్రహ్మణ్యం

గమ్యం

ఈ సినిమాలు కూడా చూడదగినవే

రాఖీ

కలర్‌ఫొటో