2022లో ఇండియాలో యూట్యూబ్‌లో బీభత్సమైన వ్యూస్‌తో ట్రెండ్ అయిన 10 పాటలను ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం విడుదల చేసింది. ఈ 10 పాటల్లో 4 ఒక్క తెలుగు సినిమాలోనివే. ఇంతకీ ఆ 10 పాటలేంటో చూద్దామా!
2022లో అల్లు అర్జున్ ‘పుష్ప’ ఓ సంచలనం. ఇందులోని ‘శ్రీవల్లి’ పాట హిందీ వెర్షన్‌కు ఏకంగా 600 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ అయితే లక్షల్లో వైరల్ అయ్యాయి. క్రికెట్ ప్రపంచంలోని సెలబ్రిటీల్లో దాదాపుగా అందరూ ఈ పాటకు రీల్స్ చేశారంటే అతిశయోక్తి కాదు
బీస్ట్ సినిమాలో హలమతీ హబీబో అంటూ సాగే ఈ పాట ఏకంగా 493 మిలియన్ వ్యూస్‌తో ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్స్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది. జానీ మాస్టర్ క్రేజీ స్టెప్పులకు సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఈ పాట సింగర్ జోనితా గాంధీకి ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.
2.అరబిక్ కుత్తు-బీస్ట్
సంగీతం: అనిరుధ్ రవిచందర్సింగర్స్: అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ
మూడో స్థానం మళ్లీ ‘పుష్ప’దే. ఇది కూడా హిందీ వెర్షన్‌లోనే సూపర్ హిట్ అయింది. రష్మిక నడుమొంపుల స్టెప్పులకు సంగీత, నృత్య ప్రియులు పిచ్చెక్కిపోయారు. 491 మిలియన్ వ్యూస్‌తో ఇది ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
కోక్ స్టూడియో తీసుకొచ్చిన ఈ పాట వింటుంటే ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు ఉంటుంది. 457 మిలియన్ వ్యూస్‌తో ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈ పాట మీద వచ్చిన రీల్స్ కూడా మిలియన్లలో ఉంటాయి.
4.పసూరి- కోక్ స్టూడియో
సంగీత కూర్పు: అలీ సేతి, జుల్పీ సింగర్స్: అలీ సేతి, షా గిల్
స్టార్ హీరో లేడు, అదిరిపోయే స్టెప్పులు లేవు, టాప్ మ్యూజిషియన్ పాట కూడా కాదు, కానీ, 383 మిలియన్ వ్యూస్‌తో ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్స్‌లో ఐదో ప్లేస్‌లో ఉంది. సైకిల్‌పై తిరుగుతూ బాదాం అమ్ముకునే భూభన్ బద్యకార్ పాటనే రీమిక్స్ చేసి విడుదల చేయగా సంచలనం సృష్టించింది
‘పుష్ప’ ఆల్బమ్ నుంచి ఊపు ఊపేసిన మరో పాట ‘ఊ బోలేగా’. ఈ పాటకు సమంత స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాయి. యూట్యూబ్‌లోనూ అదే స్థాయిలో 344 మిలియన్ వ్యూస్‌తో ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
పుష్ప నుంచి తెలుగులో మాత్రం ‘ఊ అంటావా’ అన్నింటి కన్నా ఎక్కువగా ట్రెండ్ అయింది. 324 మిలియన్ వ్యూస్‌తో హిందీ వెర్షన్ కన్నా కాస్త వెనకబడింది. ఈ పాటకు చిన్నా, పెద్దా తేడా లేకుండా చేసిన షార్ట్స్, రీల్స్ సూపర్‌గా ఉంటాయి.
8.ఊ అంటావా మావా - పుష్ప
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సింగర్: ఇంద్రావతి చౌహాన్
ఈ భోజ్‌పురీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఏకంగా 314 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో చేరింది. చాలా సింపుల్‌గా ఉన్నా డ్యాన్స్ చేయించేలా ఉండే ఈ పాట సంగీత ప్రియులకు బాగా నచ్చింది.
9.లే లే ఆయీ కోకా కోలా- భోజ్‌పురీ
సంగీతం: సర్వింద్ మలార్ సింగర్స్: కేసరి లాల్ యాదవ్, శిల్పి రాజ్
లే లే ఆయీ కోకా కోలా పాట రూపొందించిన కేసరి లాల్ యాదవ్ నుంచి వచ్చిన మరో భోజ్‌పురీ సాంగ్ ఈ నథునియా. ఇది కూడా 257 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది
10. నథునియా- భోజ్‌పురీ
సంగీతం: క్రిష్ణ బేదర్దీ సింగర్స్: కేసరి లాల్ యాదవ్, ప్రియాంకా సింగ్