అమ్మాయిలకు అత్యంత అనువైన నగరం ఏదో తెలుసా?

YouSay Short News App

హైదరాబాద్..విమెన్ ఫ్రెండ్లీ నగరంగా నిలుస్తోంది.. చెన్నై, పూణె, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడుతూ నాలుగో స్థానంలో ఉంది

మహిళల భద్రత, పనిలో ప్రాతినిధ్యం, మహిళా సాధికారిత వంటి అంశాల్లో ముందంజలో ఉందట. పరిశ్రమల్లోనూ సరైన అవకాశాలు కల్పిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌ నగరం ఇప్పుడు విమెన్ ఫ్రెండ్లీ సిటీగా మారింది. అవతార్‌ గ్రూప్‌, పయోనీర్స్‌ ఇన్‌ DEI కన్సల్టింగ్‌ చేసిన సర్వే ఆధారంగా టాప్‌ 5లో చోటు దక్కించుకుంది.

విమెన్స్‌ సిటీ

మహిళలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సిటీ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ లెక్కిస్తారు. 111 నగరాల్లో హైదరాబాద్‌కు 62.47 CILతో నాలుగోస్థానంలో ఉంది.

సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్‌

చెన్నై - 78.41, పూణె - 69.44, బెంగళూరు – 64.48 సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్‌తో టాప్‌లో నిలిచాయి.

టాప్‌ 3

దీన్ని కనుగొనేందుకు దాదాపు 200 సర్వేలు చేశారంట. సంవత్సరం పాటు లివింగ్ ఇండెక్స్‌, క్రైమ్‌ రికార్డ్స్ సహా చాలా పరిశీలించి లెక్కించారు.

200 సర్వేలు

సాఫ్ట్‌వేర్‌ కల్చర్‌ ఎక్కువగా ఉండే చెన్నై, పూణె, బెంగళూరు వంటి నగరాల్లో మహిళా ప్రాధాన్యత ఉండటం సహజం. కానీ, వాటితో పోలిస్తే కాస్త తక్కువే ఉన్న హైదరాబాద్‌ వాటితో పోటీగా నిలుస్తోంది.

ధీటైన నగరాలకు పోటీ

మహిళల భద్రతకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోంది. షీ టీమ్స్‌ పేరుతో ఆకతాయిల ఆటకట్టిస్తూ అతివలగా అండగా నిలుస్తున్నారు పోలీసులు. వారికోసం ప్రత్యేకంగా ఎన్నో యాప్స్‌ను తీసుకువచ్చారు.

భద్రతలో భళా

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనూ మహిళలకు ప్రాతినిధ్యం దక్కుతుంది. భాగ్యనగరంలోని చాలా సంస్థల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

పనిలోనూ అవకాశాలు

అతివలు సొంతకాళ్లపై నిలబడేందుకు వీ హబ్‌ను తీసుకువచ్చారు. స్టార్టప్‌ ఐడియాలకు కేంద్రంగా మారటంతో చాలామంది కలల్ని నెరవేర్చుకుంటున్నారు.

మహిళా సాధికారత

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్టణం టాప్‌ 10లో 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాకినాడ -12, విజయవాడకు -19వ ప్లేస్‌లో నిలిచాయి.

ఏపీ నగరాలు

తెలంగాణ నుంచి లిస్ట్‌లో మరో నగరం వరంగల్‌ కూడా ఉంది. విమెన్స్ ఫ్రెండ్లీ నగరాల్లో జాబితాలో 16వ ర్యాంకు సాధించింది.

ఓరుగల్లు