TRAIN TRAGEDY: దేశ చరిత్రలో పెను విషాదం… ఒడిశా రైలు ప్రమాదం చివరి క్షణాలు
YouSay Short News App
శుక్రవారం రాత్రి 7.30- 8 గంటల మధ్య బాలాసోర్‌లోని బహనాగ్ స్టేషన్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది
రైలు ప్రమాదానికి మూడు రైళ్లు వరుసగా ఢీకొనడమే ప్రధాన కారణంగా తెలిసింది
అధికారుల ప్రకారం.. బెంగళూరు నుంచి హౌరాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. బహనాగ్ వద్ద తొలుత పట్టాలు తప్పింది.
ఫలితంగా రైలు బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. అదే ట్రాక్‌పై నుంచి వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది.
ఫలితంగా కోరమండల్ రైలు 15 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ బోగీలను గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ప్రమాద తీవ్రతకు బోగిల్లోని ప్రయాణికులు బయటకు విసిరేయబడ్డారు
బోగిలు గాల్లోకి లేచి.. ఒకదానిపైకి మరోకటి చొచ్చుకెళ్లాయి
మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఘటనా స్థలి.. హృదయ విదారకంగా మారింది
ప్రమాదంలో మృతుల సంఖ్య 270 దాటింది. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఒడిశాలోని ఆస్పత్రులు శవాల కుప్పలతో నిండిపొయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి
ప్రమాదం కారణాలు తెలుసుకునేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది
మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది
రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి
భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు ముందుకొస్తామని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ప్రకటించాయి
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App