రచయితగా తన కలానికి పదును పెడితే.. దర్శకుడిగా వాటికి రూపం కల్పించాడు. ఆయన డైలాగులు ఆలోచన రేకెత్తిస్తాయి. ఆవేశ పరుస్తాయి. హితబోధ చేస్తాయి. ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన రాసిన డైలాగులు పాఠాలు. ఎలా బతకాలో నేర్పే గుణపాఠాలు. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఆ అక్షరాల తూటాలని ఓసారి తరచి చూద్దాం.
నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
- అతడు
యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం
- జల్సా
యాక్సిడెంట్ అంటే ఓ బైకో కారో రోడ్డు మీద పడటం కాదు..ఓ కుటుంబం మొత్తం రోడ్ మీద పడిపోవడం
- s/o సత్యమూర్తి
బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం. బాగున్నవాడిని బాగున్నావా అని అడగటం అనవసరం.
- నువ్వు నాకు నచ్చావ్
విచ్చలవిడిగా నరికితే హింస.. విచక్షణతో నరికితే ధర్మం
- అజ్ఞాతవాసి
సక్సెస్‌లో ఏ వెధవైనా నవ్వుతాడు. ఫెయిల్యూర్‌లో నవ్వే వాడే హీరో.
- చిరునవ్వుతో
కారణం లేని కోపం... ఇష్టం లేని గౌరవం... బాధ్యత లేని యవ్వనం...జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం
- తీన్‌మార్
అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు పెద్దలు గుర్తురారు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తురాడు.
- మన్మథుడు
ఒక్కడికి ఉంటే కోపం...అదే గుంపుకి ఉంటే పౌరుషం.
- జల్సా
ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు.
- అత్తారింటికి దారేది
కన్నీళ్లు చాలా విలువైనవి. వాటిని విలువ లేని వాళ్ల కోసం ఖర్చు చేయొద్దు.
- చిరునవ్వుతో
మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయ్. సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
- నువ్వు నాకు నచ్చావ్
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.
- నువ్వే నువ్వే
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. కానీ, దురదృష్టం తలుపు తీసే వరకు తడుతుంది.
- వాసు
ప్రేమ చదవడం అయితే, పెళ్లి పరీక్షలు రాయడం
- చిరునవ్వుతో
పాలిచ్చి పెంచిన తల్లులకు...పాలించటం ఒక లెక్కా
- అరవింద సమేత వీరరాఘవ
పాలిచ్చి పెంచిన తల్లులకు...పాలించటం ఒక లెక్కా
- అరవింద సమేత వీరరాఘవ
ఒళ్లు తడవకుండా ఏరు దాటడం, కళ్లు తడవకుండా ప్రేమ దాటడం అసహజం.
- చిరునవ్వుతో
యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు.