YouSay Short News App

సంజూ..’శని’ని పాకెట్‌లో పెట్టుకున్నావా భయ్యా!!

సంజూ శాంసన్… సంజూ శాంసన్… గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అవకాశాలు ఇవ్వట్లేదని, వివక్ష చూపుతున్నారని, కావాలనే పక్కనపెడుతున్నారని ఇలా ఎన్నో వివాదాలు.

కానీ, ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం గురించి మాట్లాడుకోవాలి. అదే సంజూ దురదృష్టం. రాకరాక శ్రీలంక సిరీస్‌తో అవకాశం వచ్చి ఊపిరి పీల్చుకునే లోపు...గాయంతో వెనుదిరగాల్సి వచ్చింది.

సంజూ శాంసన్ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మెన్‌. దీనివల్ల పంత్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్ వంటి వాళ్లతో జట్టులో స్థానం కోసం పోటీ పడాల్సి వస్తోంది. ఫలితంగా అవకాశాల కోసం ఎదురుచూపులే ఎక్కువయ్యాయి.

ఎదురుచూపులు

నిలకడలేమితో ఇబ్బంది పడుతాడనే సాకుతో సెలెక్టర్లు సంజూని ఎంపిక చేయలేదు. తర్వాత ఫామ్‌లో ఉండి రాణించినప్పటికీ టీ 20 ప్రపంచకప్‌కు నో ఛాన్స్‌ అనే బోర్డు కనిపించింది.

నో ఛాన్స్‌

అభిమానుల గోల, ట్విటర్‌లో రచ్చ తట్టుకోలేక శాంసన్‌ను న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, పొట్టి సిరీస్‌లో పూర్తిగా బెంచ్‌కు పరిమతం అయ్యాడు.

బెంచ్‌కే పరిమితం

ఇక మూడు వన్డేల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో అవకాశం రాగా 36 పరుగులతో పరవాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

ఆడినా అంతే

ఎంతోకాలంగా ఒక్క ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న సంజూకి శ్రీలంక సిరీస్‌ వరంలా మారింది. పంత్ లేకపోవటం, విమర్శలు రావటంతో అతడిని తీసుకున్నారు. కానీ, ప్లేస్‌ మాత్రం సస్పెన్స్‌.

ఒక్క ఛాన్స్‌

ఆలస్యం ఎందుకు ప్రయోగం చేద్దామనుకున్నారు కావచ్చు. ఈ రాజస్థాన్‌ కెప్టెన్‌కు అవకాశం ఇచ్చారు. కానీ, కేవలం 5 పరుగులు చేసి వెనుదిరిగాడు.

రానే వచ్చింది

ఈ సారి సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్‌ ఇలా ఎవ్వరూ అడ్డు రాలేదు. నేనున్నాను..నిన్ను వదలను అంటూ దురదృష్టం మళ్లీ పలకరించింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయం రూపంలో వచ్చేసింది.

నిన్ను వదలను

గాయం కారణంగా సంజూ శ్రీలంకతో సిరీస్‌కే దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్‌ స్థానానికే ఎసరు పడేలా ఉంది.

సిరీస్‌కే దూరం

అనూహ్య రీతిలో సంజూ సిరీస్‌కు దూరం కావడం పట్ల అభిమానులు బాధతోనే వ్యగ్యంగా విమర్శిస్తున్నారు. శనికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నావే, ఇంత దరిద్రం ఏంటి భయ్యా అంటూ గొల్లుమంటున్నారు..

శనికి బ్రాండ్ అంబాసిడర్‌

సంజూ కెరీర్‌ లెక్కలు