తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గానూ రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,11,685, మూలధన వ్యయం రూ.37,325గా ఆర్థిక మంత్రి హరీశ్ రావు వివరించారు.
సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా కీర్తి గడిస్తున్న రాష్ట్రంలో సాగుకు భారీగానే నిధులు కేటాయించారు. త్వరలోనే రైతు రుణ మాఫీ కూడా చేస్తామని భరోసా ఇచ్చారు
వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
బడ్జెట్‌లో కీలక కేటాయింపులు-విషయాలు
ఎకరానికి ఏటా రూ.1.5లక్షల నికర ఆదాయాన్నిచ్చే పామాయిల్ సాగును రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా రూ.1000 కోట్లు కేటాయించారు.
పామాయిల్ సాగుకు రూ.1000 కోట్లు
1200 చెక్‌డ్యాంలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, ఖమ్మం సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం మొదలైన ప్రాజెక్టులతో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందకెళ్తున్నామని చెబుతూ..రూ.26,885 కోట్లు కేటాయించారు.
నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తూ, వ్యవసాయానికి ఉచిత కరెంటు పంపిణీ చేస్తున్న సర్కారు ఈ సారి విద్యుత్ శాఖకు రూ.12,727 కోట్లు కేటాయించింది.
విద్యుత్ శాఖకు రూ.12,727 కోట్లు
57 ఏళ్లు పైబడిన వారందరితో పాటు ఒంటరి మహిళ, దివ్యాంగులకు ఇస్తున్న ఫించన్ల కోసం రూ.12000 కోట్లు కేటాయింపు చేశారు.
ఆసరా ఫించన్లకు రూ. 12వేల కోట్లు
తెలంగాణలో దళితుల అభ్యుదయం కోసం ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చే లక్ష్యంతో తీసుకొచ్చిన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
దళితబంధుకు రూ.17,700 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధికి ఈసారి ఘనంగా కేటాయించారు. ఏకంగా రూ.36,750 కోట్లను ప్రత్యేక ప్రగతినిధి చట్టానికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఎస్టీ ప్రగతికి రూ.15,233 కోట్లు కేటాయింపులు చేశారు.