01 Dec udit narayan vertical

ఉదిత్ నారాయణ్  తెలుగు సూపర్ హిట్ సాంగ్స్

YouSay Short News App

తెలుగు, హిందీ, తమిళ్ ఏ భాషలోనైనా పరిచయం అక్కర్లేని గాయకుడు ఉదిత్ నారాయణ్. తన గాత్రంతో ఎన్నో పాటలను సూపర్ హిట్లుగా మలిచి శ్రోతలను అలరించారు.

OF-pI35u_400x400

మెలోడి, మాస్ ఏదైనా ప్రేక్షకులు ఉర్రూతలూగాల్సిందే. ఉదిత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన టాప్‌ సాంగ్స్ వినేయండి మరి.

czTnteL8_400x400
sticker_sound
okkadu-movie-review

మహేశ్ బాబు, భూమికా చావ్లా నటించిన ఒక్కడు చిత్రంలోని పాట ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. మణిశర్మ బాణీలకు, ఉదిత్ నారాయణ్ గాత్రంతో పాటు మహేశ్ స్టెప్స్ తోడవ్వటంతో సూపర్ హిట్ గా నిలిచింది.

1. చెప్పవే చిరుగాలి - ఒక్కడు

Kushi (2001) Telugu Songs Lyrics

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన ఖుషీ సినిమాలోని అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అనే పాట అప్పట్లో ఓ సంచలనమే. ఉదిత్ తన స్టైల్ లో పాడి ఈ పాటకు మరింత జోష్ తెచ్చారు.

2. అమ్మాయే సన్నగా - ఖుషీ

TeluguFilmPoster_Aadavari_matalaku_ardhale_verule_1

విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమాలోని ఈ పాట చాలా ఫేమస్. త్రిషతో ప్రేమలో పడినప్పుడు వచ్చే ఈ మెలోడి పాటకు మంత్రముగ్ధులు కావ్వాల్సిందే.

3. ఏమైంది ఈ వేళ - ఆడవారి మాటలకు అర్థాలు వేరులే

UKAtQEbXlJsC3wMatTTBvufaNNt3lfvvQTTMssYh

తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే చిత్రంలో నా మనసుకు ఏమైంది అనే పాట యువతను ఆకట్టుకుంది. కోటి సంగీతం అందించగా.. ఉదిత్ అద్భుతంగా ఆలపించారు.

4. నా మనసుకేమైంది - నువ్వే నువ్వే

hqdefault

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మెుదటి చిత్రం స్టూడెంట్ నెం. 1లో ఈ పాట మరిచిపోలేరు. ఎన్టీఆర్, గజాల నృత్యాలు కీరవాణి సంగీతం ఒక ఎత్తైతే…ఉదిత్ నారాయణ్ గాత్రం మరో ఎత్తు.

5. పడ్డానండీ ప్రేమలో మరి - స్టూడెంట్ నెం.1

81YbDckWoHL._RI_

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమే లే. ఇప్పటికీ చాలామంది ఫోన్ లో రింగ్ టోన్ గా ఉన్న పాట ఇది. ఉదిత్ పాడిన పాటకు ప్రభుదేవా స్టెప్పులతో సంచలనం సృష్టించింది.

6. అందమైన ప్రేమరాణి - ప్రేమికుడు

mqdefault

ఉదిత్ నారాయణ్ పాడిన ఈ పాటకు చిరంజీవి, సౌందర్యల నృత్యాలు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.

7. రామ చిలకమ్మ - చూడాలని ఉంది

సోనాలి బింద్రేను తలుచుకుంటూ మహేశ్ బాబు పాడే సన్నివేశంలో వచ్చే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదిత్ తన గాత్రంతో ప్రాణం పోశారు.

8. బంగారు కల్లా బుచ్చమ్మో - మురారి

చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ఠాగూర్ చిత్రంలోని పాట. శ్రియా, చిరు మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ పాటకు మంచి మార్కులే పడ్డాయి.

9. వానొచ్చేనంటే - ఠాగూర్

పెహలా నషా- జో జీతో వహి సికిందర్ చిత్రంలోని మెలోడి పాట

 హిందీ హిట్స్

ఆయో మేరీ జిందగీ- అమీర్ ఖాన్ రాజా హిందుస్థానిలో హుషారైన పాట

 హిందీ హిట్స్

మిథువా- లగాన్ చిత్రంలో స్ఫూర్తి కలిగించే పాట

 హిందీ హిట్స్