UGADI SPECIAL: అమ్మాయిలూ ఈ ఉగాదికి కేక పుట్టించండి
YouSay Short News App
పండుగ వచ్చిందంటే అమ్మాయిలు అందంగా తయారవ్వకుండా ఉండరు. అందులోనూ ఉగాది వంటి వేడుకలకు సూపర్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. ఇదే సమయంలో ఫొటోలకు ఫోజులిచ్చేందుకు హీరోయిన్ల మాదిరిగా ఎలా రెఢీ అవ్వాలో చూడండి.
సంప్రదాయబద్ధంగా తయారు కావలంటే లంగాఓణీ ఫర్‌ఫెక్ట్ సెలెక్షన్. హాఫ్ సారీ కట్టుకొని నడుము చుట్టూ అలా వడ్డాణం, మెడలో ఓ హారం పెట్టుకుంటే అదిరిపోతుంది.
పండుగలకు చీరకట్టు కచ్చితంగా ప్రత్యేకమే. సూపర్ లుక్ ఉండే చీర కట్టుకొని కొప్పు వేసి చుట్టూ మల్లెపూలు పెట్టుకుంటే చూపు తిప్పుకోరు ఎవ్వరు.
నేహా శెట్టిలా…
డిజైనర్ లెహంగాలో డీజే టిల్లు బ్యూటీ మాదిరిగా ఇలా రెఢీ అయిపోండి. మిమ్మల్ని చూసిన ఎవ్వరైనా వాహ్వా అనాల్సిందే.
లైట్ గ్రీన్ కలర్ చీరలో మినిమల్ జువెల్లరీ పెట్టి జడను కొప్పు మాదిరిగా కట్టుకొని పువ్వులు పెట్టుకుంటే సింపుల్ సూపర్‌గా ఉంటుంది.
శ్రీలీలలా మెరిస్తే...
పింక్ కలర్ డ్రెస్‌పై హారం, నెక్లస్‌తో పాటు కాస్త ఎక్కువ జువెల్లరీ పెట్టుకొని పెద్దగా ఉండే కమ్మల బుట్టాలు ధరిస్తే శ్రీలీల మాదిరిగా మెరిసిపోవచ్చు.
డిఫరెంట్ లుక్‌లో
హాఫ్ సారీలో కాస్త డిఫరెంట్‌గా నభా నటేశ్‌లా ట్రై చేయవచ్చు. ఎలాంటి బంగారు నగలు పెట్టుకోకున్నా అందంగా కనపిస్తారు.
మెహ్రీన్‌లా ట్రెండ్ సెట్
అల్ట్రా ట్రెండీగా కనిపించే లెహంగా ధరించి పొడవైన జుమ్కీలు పెట్టుకొని జుట్టును అలా వదిలేసి ఫోటోలు క్లిక్‌మనిపిస్తే లైక్స్ వెల్లువెత్తుతాయి.
సింపుల్‌గా
గ్రీన్, ఎల్లో కాంబినేషన్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలా సింపుల్‌గా మేకోవర్ అవ్వచ్చు.
ఎలాంటి నగలు ధరించకుండా కేవలం ఒక సింపుల్ డ్రెస్‌తో అద్భుతంగా రెడీ కావచ్చు. ఇలాంటి ఔట్‌ఫిట్ ఉంటే చాలు.
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.