on Oct 23/2022

INDvsPAK

క్రికెట్ చరిత్రలో మరపురాని మ్యాచ్

Floral Separator

హార్దిక్ ఆన్‌స్ట్రైక్. నాన్‌స్ట్రైకింగులో నిల్చున్న విరాట్. ఆఫ్ స్పిన్నర్ నవాజ్ చేతికి బంతిని ఇచ్చిన పాక్ కెప్టెన్.

విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి.

19.1 తొలిబంతికే షాట్ ఆడబోయి ఔటైన హార్దిక్. నాన్‌ స్ట్రైకింగులోనే విరాట్. సమీకరణం 5 బంతుల్లో 16పరుగులు.

19.2 క్రీజులోకి వచ్చి సింగిల్ తీసిన దినేశ్ కార్తిక్. కాస్త ఊరట. విరాట్ ఉన్నాడని ధైర్యం.

19.3 నవాజ్ వేసిన బంతిని నేరుగా ఆడిన విరాట్. రెండు పరుగులు తీయడం కష్టమే. అయినా, వేగంగా పరుగెత్తి 2రన్స్ సాధించిన విరాట్- కార్తిక్. మళ్లీ ఉత్కంఠ.

19.4 పట్టు కోల్పోయి ఫుల్ టాస్ వేసిన నవాజ్. బంతిని సిక్స్‌గా మలిచిన విరాట్. కోహ్లి అప్పీల్‌తో నో బాల్‌గా ప్రకటించిన అంపైర్. అభిమానుల్లో మళ్లీ రేగిన ఉత్సాహం.

19.4 సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులు. వైడ్ వేసిన బౌలర్. ఒత్తిడిలో పాక్. కొనసాగుతున్న ఫ్రీ హిట్.

19.4 వికెట్లను తాకి థర్డ్ మెన్ వైపు దూసుకెళ్లిన బంతి. చాకచక్యంగా 3 రన్స్ తీసిన విరాట్- డీకే. బైస్‌గా ప్రకటించిన అంపైర్.

19.5 హమ్మయ్య. తేలికైన సమీకరణం. 2 బంతుల్లో 2 పరుగులు. కుర్చీల్లోంచి లేచి నిలబడి చూస్తున్న క్షణం. ప్చ్.. దినేశ్ కార్తీక్ స్టంప్ అవుట్.

19.6 మళ్లీ టెన్షన్ టెన్షన్. క్రీజులోకి వచ్చిన అశ్విన్. చురుకుగా వ్యవహరించి వైడ్ బాల్‌ని వదిలేశాడు. మ్యాచ్ టై.

19.6 అశ్విన్ ఏం చేయబోతున్నాడు అని రెప్ప వాల్చకుండా చూస్తున్న జనం. బ్యాటర్, బౌలర్‌పై ఒత్తిడి. మిడాఫ్ మీదుగా బంతిని గాల్లోకి లేపి విజయాన్ని అందించిన అశ్విన్.

విరాట్ ఏమన్నాడంటే..?

‘ఇదివరకు నా ఫేవరేట్ ఇన్నింగ్స్ మొహాలీలో 82(52) చేసినదే. ఇప్పుడు 82(53) చేశా. కానీ, ఇదే నా అత్యుత్తమమైన ప్రదర్శన. ఇంత ఉద్వేగభరితమైన క్రికెట్‌ని అనుభూతి పొందడం చాలా సంతోషం’

హార్దిక్ ఒకటే చెప్పాడు.. ‘ఆత్మవిశ్వాసంతో మెలుగుదాం. బలంగా నమ్ము. మనం చివరి వరకు నిలబడితే సాధించగలమని’ . నిజంగా నాకసలు మాటలు రావట్లేదు.

ఎంతో ఉద్వేగభరితమైన క్షణాలవి. ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. ఏం జరిగిందో పాలుపోలేదు. వేరే మైకంలో ఉన్నా. ఆ క్షణంలో గొంతు మూగబోయింది.

విరాట్‌ కొట్టినట్లు ఆ రెండు సిక్సులూ బాదడం ఎవరివల్లా కాదు.

అబ్బురపడిన హార్దిక్

‘‘నా మైండ్‌లో ఒకటే ఆడుతోంది. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. నాకంటే నువ్వే అనుభవజ్ఞుడివి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాటుదేలిన ఆటగాడివి. ఇప్పుడు నీకంటే బాగా ఎవరూ ఆడలేరని విరాట్‌తో చెప్పా’’

నీకోసం నేను ఔటైనా ఫర్వాలేదు. కానీ, నువ్వు మాత్రం క్రీజులోనే ఉండాలి’

- విరాట్‌తో హార్దిక్ పాండ్యా.

‘కోహ్లి కోసం అవసరమైతే బుల్లెట్ దెబ్బలను కాచుకుంటాను కానీ.. అతడు మాత్రం ఔటవకూడదని కోరుకున్నా’

- హార్దిక్ పాండ్యా.