UNION BUDGET 2023-24:
కేంద్ర బడ్జెట్ అంచనా వ్యయాలు- రాబడులు
YouSay Short News App
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2023-2024 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్‌లోని ప్రధానాంశాలు
2023-24 బడ్జెట్ అంచనాలలో, రుణాలు మినహాయించి మొత్తం రాబడులు, చేయబోయే మొత్తం ఖర్చులు అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్ అంచనాలు
బడ్జెట్‌లో మొత్తం రాబడులు రూ.27.2 లక్షల కోట్లు(రుణాలు మినహాయించి)
బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.45లక్షల కోట్లు(రుణాలు కలుపుకుని)
నికర పన్నుల ఆదాయం రూ.23.3లక్షల కోట్లు
సవరించిన అంచనాల ప్రకారం 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతమని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
లోటు బడ్జెట్
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 2.9 % ఉండాలని లక్ష్యం
ఆర్థిక లోటును 2025-26 నాటికి 4.5% దిగువకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయం రూ.7.5లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
మూలధన వ్యయం:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూ.14.20 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.13.30 లక్షల కోట్లు వసూలు కానున్నట్లు అంచనా
పన్నుల ద్వారా ఆదాయం:
ఈ మొత్తం రాబడి రూ.27.50 లక్షల కోట్లకు చేరుకుంటుంది.
మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ స్థూల రుణాల మొత్తం రూ.14.31 లక్షల కోట్లుగా ఉంది
రుణాలు:
ప్రభుత్వం తన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి అవసరాన్ని బట్టి మార్కెట్ నుంచి రుణాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు కేటాయించారు.
FY2022-23 మొదటి 8 నెలల్లో ప్రత్యక్ష పన్నులు 23.5% పెరిగాయి. ఇదే సమయంలో పరోక్ష పన్నులు 8.6% పెరిగాయి
పెరిగిన పన్ను ఆదాయం
రాష్ట్రాల GSDPలో 3.5 శాతం ద్రవ్య లోటుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది
రాష్ట్రాలకు చేయూత
రాష్ట్రాలకు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాన్ని అందించాలని నిర్ణయించినట్లు నిర్మల చెప్పారు
ఈసారి బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ గుర్తించలేదు. ప్రభుత్వరంగ సంస్థలపై కనికరం చూపినట్లు తెలుస్తోంది.
పెట్టుబడుల ఉపసంహరణ లేదు
మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి
Watch Now