కేంద్ర బడ్జెట్ 2023:  బడ్జెట్‌లో రంగాల వారిగా కేటాయింపులు

YouSay Short News App

శ్రీ అన్న పథకం ద్వారా చిన్నధాన్యాల రైతులకు ప్రోత్సాహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్  కేంద్రంగా పరిశోధనలు చేయాలని నిర్ణయించింది

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 20లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది

పీఎం మత్స్య సంపద యోజన కొత్త పథకం ద్వారా మత్స్య కార్మికులకు చేయూత. దీని కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు

ఆత్మనిర్బర్ భారత్ క్లీన్ పథకం ద్వారా ఉద్యాన పంటకు చేయూత వ్వవసాయ స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధి

ఈ బడ్జెట్‌లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

యువత కోసం గ్రామపంచాయతీల్లో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రలకు నిధులు కేటాయించనున్నట్లు  వెల్లడించారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలకు అనుమతి, పరిశోధన సంస్థ ICMR ప్రయోగశాలలను విస్తృతి పెంపు

2023 నాటికి 5MMT హైడ్రోజన్ తయారీ లక్ష్యం. లడఖ్‌లో గ్రీన్ ఎనర్జీ కోసం రూ.20,700 కోట్లు కేటాయింపు

జాతీయ సహకార డెటా బెస్‌ కేంద్రం కోసం రూ.2516 కోట్లు కేటాయింపు

5జీ అప్లికేషన్ల తయారీ కోసం దేశవ్యాప్తంగా 100 ప్రయోగశాలలు ఏర్పాటు

కొత్త ఆదాయ పన్ను వ్యవస్థను అనుసరించే వారికి  ఆదాయపన్ను పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచారు. వీరికి రూ.7లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు

0 to Rs 3 lakhs - nil, Rs 3 to 6 lakhs - 5%, Rs 6 to 9 Lakhs - 10%, Rs 9 to 12 Lakhs - 15%, Rs 12 to 15 Lakhs -20% above 15 Lakhs - 30%,

New Tax Rates

మహిళల కోసం నిర్మలా సీతారామన్  కొత్త సేవింగ్ స్కీమ్ ప్రతిపాదించారు.  ఈ పథకం  రెండేళ్ల కాలపరిమితితో ఉంటుంది. రూ. 2 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు 7.5శాతం వస్తుంది.

వయో వృద్ధుల కోసం సేవింగ్ పరిమితిని రూ.15 లక్షలు-రూ.30 లక్షలకు పెంచారు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పరిమితిని సైతం కేంద్రం సవరించింది. ప్రస్తుతమున్న రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు.

జాయింట్ అకౌంట్ ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న రూ.9 లక్షల పరిమితి నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ స్కీమ్‌పై రూ.7.10శాతం వడ్డీ వస్తుంది.

రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.2.40 లక్షలు కోట్లు కేటాయించారు

కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు  నిర్మల చెప్పారు. మరిన్ని వందే భారత్ ట్రైన్లు రానున్నట్లు పేర్కొన్నారు.

దేశంలోని రాష్ట్రాల్లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు 50 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్స్, వాటర్ ఏరో డ్రోన్స్ నిర్మించి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు  రూ. 75 వేల కోట్లు కేటాయించారు.

ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్లు, పట్టణ మౌలిక వసతుల కల్పనకు రూ. 10 వేల కోట్లు కేటాయించారు.

పర్యాటకం

పర్యటక రంగ అభివృద్ధి కోసం దేశంలోని 50 ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు స్వదేశీ దర్శన్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి