UNION BUDGET 2023: ఆదాయపన్ను ఎంత కట్టాలో ఇంకా అర్థం కావడంలేదా? రూ. 7లక్షలు ఆదాయం దాటితే ఎంత పన్ను కట్టాలి? సమగ్ర విశ్లేషణ
YouSay Short News App
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పిస్తూ పన్ను చెల్లించే ఆదాయ పరిమితిని పెంచింది. కొత్త ఆదాయ పన్ను శ్లాబులను ప్రతిపాదించింది.
అయితే కొత్తగా ప్రతిపాదించిన ఆదాయ పన్ను శ్లాబులు చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీటిని నివృత్తి చేసేందుకు YouSay Web చిన్న ప్రయత్నం చేసింది.
తాజా బడ్జెట్‌లో ఆ పరిమితిని రూ.7లక్షలకు పెంచారు. అంటే ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ శ్లాబుల ప్రకారం తొలుత పన్ను చెల్లించాలి. ఆ చెల్లించిన మొత్తం రీబెట్ ద్వారా కేంద్రం తిరిగి చెల్లిస్తుంది.
రూ.7లక్షల పరిమితి కేవలం కొత్తగా పన్నును అనుసరించే వారికి వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఇది వర్తించదు.
పాత పన్ను విధానంలో ఆదాయపన్న చట్టం 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 80డి కింద రూ. 25 వేల రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది. ఇంటి అద్దె, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి అనేక మార్గాల్లో మినహాయింపులను ఉపయోగించుకోవచ్చు.
పాత పన్ను విధానం ఏమిటి?
0 to Rs 3 lakhs - nil,
Rs 3 to 6 lakhs - 5%,
Rs 6 to 9 Lakhs - 10%,
Rs 9 to 12 Lakhs - 15%,
Rs 12 to 15 Lakhs -20%
above 15 Lakhs - 30%,
కొత్త ఆదాయ పన్ను విధానంలో నూతన శ్లాబులు
అయితే ట్యాక్స్ శ్లాబ్‌లు చూసి కన్ఫూజ్ కావొద్దు. ఇందాక రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన పనిలేదు అని చెప్పి మళ్లీ రూ.3లక్షల వరకు పన్ను పడదు అని చెబుతున్నారేంటి అని కన్ఫ్యూజ్ కావొద్దు.
నో కన్ఫ్యూజ్
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రూ.7లక్షల వరకు టాక్స్ ఉండదు అంటే రూ.7లక్షలపై చెల్లించిన పన్ను రీబెట్ రూపంలో తిరిగి కేంద్రం చెల్లిస్తుంది.
కానీ రూ.7లక్షలకు ఒక్క రూపాయి పెరిగిన
ఆ మొత్తంపై ప్రభుత్వం ప్రతిపాదించిన శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.
కొత్త పన్ను విధానం ప్రకారం రూ.7లక్షలపై రీబెట్ ఎలా వస్తుంది?
వివరంగా చూద్దాం..
0 to Rs 3 lakhs - nil,
Rs 3 to 6 lakhs - 5%,
Rs 6 to 9 Lakhs - 10%
మీ వార్షిక ఆదాయం రూ.7లక్షలు అయితే.. శ్లాబు రూ.3లక్షలు- 6 లక్షల మధ్య పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.3 లక్షలు. దీనిపై 5శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ.15 వేలు పన్ను చెల్లించాలి.
ఆతర్వాత శ్లాబు రూ.6లక్షలు- రూ.9లక్షల మధ్య పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.1 లక్ష కదా. దీనిపై 10శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ.10 వేలు పన్ను చెల్లించాలి.
మొత్తంగా రూ.7లక్షల వార్షిక ఆదాయం ఉంటే రూ.25 వేలు తొలుత పన్ను రూపంలో చెల్లించాలి. ఈ మొత్తం రూ.20వేలను రీబెట్ రూపంలో కేంద్రం పన్ను చెల్లింపుదారుడి అకౌంట్లో జమ చేస్తుంది.
రూ.7లక్షల వార్షిక ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్న కేంద్రం అసలు ఉద్దేశం ఇది.
ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ.7లక్షలపై ఒక్కరూపాయి దాటినా రీబెట్ రాదు.
రూ.7లక్షలు దాటితే పన్ను లెక్కింపు
ఉదాహరణకు మీ జీతం సంవత్సరానికి రూ.9 లక్షలు అనుకుందాం. ఈ మొత్తంపై పన్ను ఎలా విధిస్తారో తెలుసుకుందాం.
తొలుత మీరు మొదటి శ్లాబ్ ప్రకారం రూ.0- రూ.3 లక్షలకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మీ రూ. 9లక్షల వార్షిక వేతనంపై మొదటి శ్లాబ్స్ ప్రకారం... రూ.0- రూ.3లక్షల వరకు పన్ను ఉండదు.
రెండో శ్లాబ్ ప్రకారం.. రూ.3- రూ. 6లక్షల మధ్య పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 3 లక్షలు కదా. దీనిపై 5 శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ. 15 వేలు పన్ను చెల్లించాలి.
ఆ తర్వాత మూడో శ్లాబ్ రూ.6 లక్షలు- రూ. 9 లక్షల మధ్య పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.3లక్షలు కదా. దీనిపై 10% పన్ను చెల్లించాలి. అంటే రూ. 30 వేలు పన్ను చెల్లించాలి.
రెండో శ్లాబ్, మూడో శ్లాబులు కలిపి మొత్తంగా
9 లక్షల ఆదాయం మీద రూ.45,000
(రూ.15,000+30,000) పన్ను చెల్లించాలి. దీనికి 4శాతం సెస్ అదనం.
పాత పన్ను విధానం శ్లాబ్‌లు
పాత పన్ను విధానం ప్రకారం పన్ను చెల్లింపు
0-2.5 లక్షలు పన్ను లేదు
రూ.2.5 లక్షలు- రూ.5లక్షలు- 5శాతం పన్ను
రూ.5లక్షలు- 10లక్షలు- 20 శాతం పన్ను
రూ.10లక్షల కంటే ఎక్కువగా ఉంటే- 30% పన్ను
Deductions under Section 80C- (-1,50,000)
Deductions under Section 80D- (-50,000)
House Rent Allowance- (-3,00000)
Leave Travel Allowance- (-10,000)
Total Deductions= 3,60,000
Taxable Amount= Gross income- total deductions
రూ.9,00000- రూ.3,60,000= రూ.5,40,000
రూ.5,40,000పై పాత పన్ను విధానం ప్రకారం పన్ను లెక్కిస్తే...
రూ.2.5 లక్షలు- రూ.5లక్షలు- 5శాతం పన్ను
రూ.5లక్షలు- 10లక్షలు- 20 శాతం పన్ను
రూ.5,40,000పై రెండు శ్లాబ్స్ వర్తిస్తాయి.
ఇప్పుడు అదే రూ.9 లక్షల ఆదాయంపై పాత పన్ను విధానం ప్రకారం మినహాయింపులు వాడుకుంటే ఎంత పన్ను పడుతుందో ఓసారి లెక్కకడుదాం..
సులభంగా అర్థం చేసుకునేందుకు మన పన్ను మొత్తాన్ని 5,00000+40,000లుగా విభజించుకుందాం...
తొలుత మొదటి శ్లాబ్ ప్రకారం రూ.5లక్షలపై 5శాతం పన్ను పడుతుంది.అంటే రూ.25 వేలు అన్నమాట
ఇప్పుడు రెండో శ్లాబ్ ప్రకారం రూ.40వేలపై 20శాతం పన్ను పడుతుంది. అంటే రూ.8వేలు.
ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే.. రూ.33,000
పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షలు- రూ.5లక్షలు- శ్లాబ్ మధ్య 87A ప్రకారం 5 % రీబెట్ వర్తిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
అంటే.. ఈ శ్లాబ్‌లో రూ.2.5 లక్షలపై 5% రీబెట్ అంటే రూ.12,500 వర్తిస్తుంది.
ఈ రీబెట్‌ను పన్ను మొత్తం నుంచి తీసివేస్తే... చెల్లించాల్సిన నికర పన్ను వస్తుంది.
(రూ.33,000-రూ.12,500)= రూ. 20,500 నికర పన్ను ( దీనికి అదనంగా రూ.820 మొత్తాన్ని ఎడ్యూకేషన్ సెస్ కింద కేంద్రం విధిస్తోంది.)
సెస్ కలుపుకుని( రూ. 20,500+820) చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.21,320.
Note: ఈ మొత్తం ఆదాయ పన్ను చట్టంలోని అన్ని సౌలభ్యాలను ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది అని గుర్తించుకోవాలి. ఏ ఒక్క ప్రయోజనాన్ని వినియోగించుకోకపోయినా చెల్లించాల్సిన పన్ను మొత్తం పెరుగుతుంది.
రూ.9 లక్షలపై పాత పన్ను విధానంలో అన్ని మినాహాయింపులు పోనూ రూ.21,320 పన్ను కట్టాల్సి వచ్చింది.
ఇదే మొత్తంపై కొత్త పన్ను విధానం ప్రకారం అయితే రూ.45వేల వరకు పన్ను కట్టాల్సి వచ్చింది.
కొత్త పన్ను విధానం ద్వారా రూ.9లక్షలు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తి రూ.45 వేలు మాత్రమే పన్ను చెల్లించాలి. అయితే కొత్త విధానం అందరికీ సరిపోతుంది అని చెప్పలేము.
ఏ పన్ను విధానం మంచిది?
పన్ను చెల్లించే వ్యక్తి పెట్టుబడులు కలిగి ఉన్నా,
జీవిత బీమా, వైద్య బీమా, హోమ్ లోన్, HRA, LTA వంటి ప్రయోజనాన్ని పొందితే...పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉండొచ్చు.
కాబట్టి మీ ఆదాయన్ని, పెట్టుబడులను బెరీజు వేసుకోని ఎంచుకుంటే అందుకు తగ్గ విధానం ఎంచుకుంచే మంచిది.
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే.. పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 10IEని ఫైల్ చేయాలి. అదేవిధంగా కొత్త పన్ను విధానం నుంచి పాత పన్ను విధానంలోకి తిరిగి మారాలనుకున్నా ఫారమ్ 10IEనే దాఖలు చేయాలి
కొత్త పన్ను విధానాన్ని ఎలా ఎంచుకోవాలి?
ఇ-ఫైలింగ్ పోర్టల్ (https://www.incometax.gov.in/)కి లాగిన్ అవడం ద్వారా పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
ఈ ఫారమ్‌లో పన్నుచెల్లింపుదారుడు పేరు, పాన్, చిరునామా, పుట్టిన తేదీ, వ్యాపారం/వృత్తి వంటి వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి