ప్రపంచ క్రికెట్‌లో సంచలనం అన్‌స్టాపబుల్‌ హ్యారీ బ్రూక్‌

YouSay Short News App

24 ఏళ్ల కుర్రాడు ఇంగ్లండ్‌ క్రికెట్‌లో తారాజువ్వలా ఎగిసిపడుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో అద్భుత రికార్డులు సృష్టిస్తూ క్రికెట్‌ ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తున్నాడు. అతడే హ్యారీ బ్రూక్‌.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టుల్లో ఆడుతున్న హ్యారీ బ్రూక్‌ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రెండు అర్ధశతకాలతో అదరగొట్టిన హ్యారీ బ్రూక్‌ రెండో టెస్టులో 169 బంతుల్లోనే 184 చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇప్పటిదాకా 9 టెస్టు ఇన్నింగ్స్‌ ఆడిన బ్రూక్‌..807 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది ప్రపంచ రికార్డు. అంతకు ముందు భారత ఆటగాడు వినోద్‌ కాంబ్లీ 9 ఇన్నింగ్స్‌లో 798 పరుగులు చేశాడు.

20 బంతుల్లో 12 vs సౌతాఫ్రికా 116 బంతుల్లో 153 vs పాకిస్తాన్‌ 65 బంతుల్లో 87 vs పాకిస్తాన్‌ 21 బంతుల్లో 9 vs పాకిస్తాన్‌ 149 బంతుల్లో 108 vs పాకిస్తాన్ 150 బంతుల్లో 111 vs పాకిస్తాన్ 81 బంతుల్లో 89, vs న్యూజిలాండ్ 41 బంతుల్లో 54 vs న్యూజిలాండ్‌ 169 బంతుల్లో 184 vs న్యూజిలాండ్                    - ( మ్యాచ్‌ ఇంకా పూర్తికాలేదు)

హ్యారీ బ్రూక్‌ చివరి 9 ఇన్నింగ్స్‌

9 ఇన్నింగ్స్‌లో 100.75 సగటు, 100.12 స్ట్రయిక్‌ రేట్‌తో 4 సెంచరీలు, 3 అర్ధ శతకాలు బాదాడు.

ఆడిన 6 టెస్టులు(9 ఇన్నింగ్స్‌) లోనే హ్యారీ బ్రూక్ 100 ఫోర్లు, 20 సిక్సులు కొట్టాడు.

హ్యారీ బ్రూక్‌ చేసిన సెంచరీలన్నీ ఇంగ్లండ్‌కు అవతల చేసినవే. సొంతగడ్డపై కాకుండా విదేశాల్లో ఇలా చెలరేగడం చూసి క్రికెట్‌ అభిమానులు అతడిని దిగ్గజాలతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 21/3 గా ఉన్న దారుణమైన స్టేజ్‌లో బ్రూక్‌ వచ్చాడు. రూట్‌తో కలిసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను 315/3కు తీసుకెళ్లాడు.

సునీల్‌ గవాస్కర్‌ (912), డాన్‌ బ్రాడ్‌మన్‌ (862) మాత్రమే తొలి 6 టెస్టుల్లో హ్యారీ బ్రూక్‌కు కన్నా ఎక్కువ పరుగులు చేశారు. అయితే వీరు బ్రూక్‌ కన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌ ఆడారు.

టెస్టుల్లోనే వన్డేలా చెలరేగుతున్న హ్యారీ బ్రూక్‌ త్వరలో భారత్‌లో ఆడబోతున్నాడు. IPLలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బ్రూక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.