Uppal Sky Walk: హైదరాబాద్‌కు మరో మణిహారం.. స్కైవాక్ ప్రత్యేకతలు ఇవే..!

YouSay Short News App

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ని దృష్ట్యా ఉప్పల్ వద్ద హెచ్ఎండీఏ స్కై వాక్ నిర్మాణం చేపట్టింది.

660 మీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద స్కై వాక్‌గా ఉప్పల్ స్కై వాక్ నిలవనుంది.

3, 4, 6 మీటర్ల చొప్పున వెడల్పుతో ఈ స్కై వాక్ నిర్మితమైంది.

కింది నుంచి పైకి ఎక్కేందుకు వీలుగా 8 లిఫ్టులు, 6 మెట్ల దారులు, 4 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.

స్కై వాక్ నిర్మాణానికి 1000 టన్నుల స్టీలు వాడారు. పాదచారులకు రక్షణగా రెయిలింగ్‌ని అమర్చారు.

ఎండ తగలకుండా విదేశాల నుంచి తెప్పించిన రూఫ్‌ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం సొంత నిధులతో ఈ స్కై వాక్‌ని నిర్మించడం విశేషం.

స్కై వాక్‌కి మొత్తంగా 6 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి దీనిని అనుసంధానించారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran