Urvasivo Rakshasivo  Review:

అల్లు శిరీష్ రొమాన్స్‌తో కుమ్మెశాడు

అమాయక మనస్తత్వం కలిగిన శ్రీ కుమార్ (అల్లు శిరీష్) సాప్ట్‌వేర్ ఇంజినీర్. అదే కంపెనీలో పనిచేసే ఒక చలాకి అమ్మాయి  సిందూజ (అను ఇమాన్యుయేల్)తో ప్రేమలో పడతాడు.

కథ

ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం నానా పాట్లు పడుతూ ఉంటాడు. శ్రీకుమార్ ప్రేమకు విలువిస్తే.. ప్రేమకన్నా శారీర సంబంధానికే సింధూజ విలువిస్తుంది.

ఈ రెండు విలక్షణమైన మనస్తత్వాల మధ్య సంఘర్షణ ఎలా ముగిసిందనేది మిగిలిన కథ

అల్లు శిరీష్ నటన పరంగా మెప్పించాడు. పరణతి చెందిన నటుడిగా కనిపించాడు. ముఖ్యంగా అను ఇమ్మాన్యుయేల్‌తో రొమాన్స్ సీన్సులో జీవించాడు.

ఎవరేలా చేశారంటే?

లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన శిరీష్, బాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మిని తలపించాడు

ఇమ్మాన్యుయేల్, శిరీష్ మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ సినిమాకే హైలెట్. అను ఇమ్మానియోలే ఈ మూవీలో గ్లామర్ డోస్ భారీగా పెంచింది. లిప్‌ లాక్ సీన్లలో సహజంగా నటించింది.

ఆఫీస్ సన్నివేశాల్లో వెన్నెల కిషోర్ టైమింగ్ పంచ్‌లతో అలరించాడు. కామెడీ సీన్స్ బాగా పెలాయి.

ఫస్ట్ హాఫ్ మొత్తం దర్శకుడు రాకేష్ శశి రొమాంటిక్, కామెడీ సన్నివేశాల సమాహారంగా నడిపించాడు. సెకండాఫ్‌లో ఎమోషన్స్ పండలేదు.

ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్రజెన్స్, పాటల చిత్రీకరణ బాగుంది. తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. రిచ్‌గా విజువల్స్ కనిపిస్తాయి. సంగీతం మెప్పించదు.

సాంకేతికంగా

హాస్యం రొమాన్స్ డ్రామా స్క్రీన్‌ప్లే

బలాలు

స్లో పేస్ రోటిన్ స్టోరీ సంగీతం భావోద్వేగాల లేమి

బలహీనతలు

రేటింగ్ 2.75/5