YouSay Short News App

వయ్యారాలు ఒలకబోస్తున్న  వాణీ కపూర్.. చూస్తే మతి పోవాల్సిందే

బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

34ఏళ్ల వాణీ కపూర్ హిందీ, తమిళ సినిమాల్లో నటించింది. కెరీర్లో ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసింది.

2013లో విడుదలైన ‘శుద్ధ్ దేసీ రొమాన్స్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వాణీ కపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సహజీవనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వాణీ కపూర్ ‘తారా’ పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే ఈ అమ్మడు ఏకంగా ఐదు అవార్డులను గెల్చుకుంది.

రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, శుద్ధ్ దేసీ సినిమా ఒక సవాలుగా అనిపించిందని వాణీ కపూర్ చెబుతుంటుంది.

2014లో విడుదలైన ‘ఆహా కళ్యాణం’ అనే తమిళ సినిమాలో వాణీ కపూర్ నటించింది.

అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమని మెరిసింది. పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాపై ఈ నటి ప్రభావం ఎక్కువ.

వాణీకపూర్ దిల్లీలో పుట్టి పెరిగింది. విద్యాభ్యాసం అంతా రాజధానిలోనే. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి ఓ టీచర్‌గా పనిచేసేది.

సినిమాల్లోనే కాకుండా వాణీ కపూర్ మ్యూజిక్ వీడియోలను చేసింది. 2017లో విడుదలైన ‘మై యార్ మనానా నీ’ అనే ఆల్బమ్ బాగా పాపులర్ అయింది.

చివరగా వాణీ కపూర్ ఈ ఏడాది విడుదలైన ‘శంషేరా’ సినిమాలో కనిపించింది. ఇందులో ‘సొనా’ పాత్ర పోషించిందీ బ్యూటీ.

రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో వాణీ కపూర్ పాత్రపై నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పాత్ర పరిధి, నిడివి తక్కువగా ఉందంటూ  విమర్శలు వచ్చాయి.