Red Section Separator

Valentines Day Gifts For Her: ప్రేమలేఖ నుంచి ప్రేమ అగ్రీమెంట్‌ దాకా!

YouSay Short News App

Cream Section Separator

శ్రీమతి అయినా కాబోయే శ్రీమతి అయినా లేదా మనసు దోచిన మధుమతి అయినా… మాటలతో ఎంతగా ప్రేమకోటలు కట్టినా ఇవాళ వింటే రేపు మర్చిపోతారు. మీ ప్రేమ వారికి గుర్తుండిపోయేలా ఉండాలంటే చక్కటి బహుమతి చాలా అవసరం. అది కూడా ప్రేమికుల కోసమే ఉన్న వాలైంటెన్స్ డే రోజు ఇంకా చాలా ముఖ్యం.

Cream Section Separator

మరి ఏం గిఫ్ట్‌ ఇవ్వాలి? తన కోసం తాజ్‌మహల్‌ కట్టివ్వగలరా లేదుగా! బహుమతి అనేది ఎంత భారీగా ఉందన్న దానికన్నా ఎంత భావోద్వేగంగా ఉందన్నదే ముఖ్యం. అందుకే ఇక్కడ కొన్ని చిలిపి, సరదా గిఫ్ట్స్‌ లిస్ట్‌ మీకోసం అందించాం.

అమ్మాయిలకు ఎంత వయసు పెరిగినా చాకొలెట్లపై ఉండే ప్రేమ మాత్రం తగ్గదు. అది ఇప్పుడే కాదు ఎప్పుడు ఇచ్చినా వారి ప్రేమను గెలుచుకుంటారు. హృదయాకారంలో ఉండే ఈ డైరీమిల్క్‌ చాకొలెట్ గిఫ్ట్‌ బాక్స్‌ ఇచ్చి చూడండి.

చాకొలెట్‌

చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను అడుగుతుంటారు అసలు నేనంటే ఎందుకు అంత ఇష్టం అని! ఆ సమాధానం కొంచెం కష్టమేననుకోండి. కారణం లేకుండా కోపం రాదేమో గానీ ప్రేమైతే పుడుతుంది. అయితే ప్రేమలో ఉన్నపుడైనా తనలో మీకునచ్చే ఓ 20 అంశాలుంటాయి. తీరిగ్గా కూర్చుని వాటిని చక్కగా రాసి ఈ బాక్స్‌లో పెట్టి గిఫ్ట్‌గా ఇవ్వండి.

అందుకే  నువ్వంటే నాకిష్టం

సాధారణంగా మనీతో ముడిపడి ఉన్న ప్రతిదానికీ అగ్రీమెంట్‌ ఉంటుంది. మనసుతో ముడిపడిన ప్రేమకు మాత్రం నమ్మకమే అగ్రీమెంట్‌. కాకపోతే ఈ ఫన్నీ లవ్‌ అగ్రీమెంట్‌ మీ ప్రియురాలి పెదాలపై చిరునవ్వును పూయించొచ్చు.

లవ్‌ అగ్రీమెంట్‌

ఉంగరం అంటే ప్రామిస్‌. అందుకే ఎంగేజ్‌మెంట్‌లో పెళ్లికి ప్రామిస్‌గా ఉంగరం తొడుగుతారు. జీవితకాల బంధానికి సూచనగా నిలిచే ఉంగరం ప్రియురాలికి ఎప్పుడు ఇచ్చినా ప్రత్యేకమే.

ఉంగరం

మీకు దూరంగా ఉన్న ప్రియురాలికి మీరు పక్కనే ఉన్నారన్న భావించ కలిగించాలా? ప్రత్యేకంగా ఉండే  ఓ దిండు కొనివ్వండి చాలు. ఆ దిండును పట్టుకుని కళ్లు మూసుకుని మీరు పక్కనే ఉన్నారన్నట్లుగా పడుకుంటుంది.

దిండు ( Pillow)

టెడ్డీ బేర్ నచ్చని అమ్మాయిలు చాలా తక్కువ. ముద్దుగా బొద్దుగా అమాయకమైన కళ్లతో ఉండే టెడ్డీ బేర్‌..ప్రశాంతమైన ప్రేమకు చిహ్నం. ఇది కూడా దిండులాగే మీరు పక్కన లేనపుడు మీరున్నారన్న భరోసా ఇస్తుంది.

టెడ్డీ బేర్‌

పైన చెప్పిన వాటిలో దాదాపుగా అన్నీ ఇవ్వాలనుందా? అయితే అన్నీ కొంచెం కొంచెంగా ఉండే ఈ గిఫ్ట్‌ ప్యాక్ ఎంచుకోండి. మీ ప్రియురాలికి చక్కటి బహుమతి.

ప్రతీది కొంచెంగా

మన ఫోన్లో వేల ఫోటోలు ఉన్నా తనతో ఉన్న  ఆ ఒక్క ఫోటో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది కదా! ఆ ప్రత్యేకతను చూపించండి మరి. ఓ చక్కటి ఫోటో ఫ్రేమ్‌ కొని అందులో మీ ఫోటో పెట్టి ఇవ్వండి.

ఫోటో ఫ్రేమ్‌

ఈ మధ్య మన ఫోటో, టెక్స్ట్‌ ఏదైనా మనం కోరుకున్నది గ్లాస్‌పై ప్రింట్‌ చేసేసి ఇచ్చేస్తున్నారు. మార్నింగ్‌ కాఫీ కప్పుతోనే మీ ప్రేమను ఆమెకు గుర్తుచేయాలనుకుంటే మీరు జంటగా ఉన్న  ఓ చక్కటి ఫోటోను ప్రింట్ చేయించి ఇవ్వండి.

ప్రియమైన గ్లాసు

పెళ్లైతే మంగళసూత్రం ఉంటుంది. మరి ఇప్పుడెలా? ఓ చక్కటి లాకెట్ కొనండి. తన అభిరుచికి తగినట్లుగా ఎంచుకోండి. అందులో మీ ఫోటోలు ఉండేలా ఉంటే మరీ బాగుటుంది. తన హృదయానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది మీకు.

లాకెట్‌