వాలెంటైన్స్ డే స్పెషల్: సినిమాతో పరిచయమై ప్రేమ ప్రయాణం చేసి పెళ్లితో ఒక్కటైన జంటలు
YouSay Short News App
సినిమా ప్రపంచంలో హీరో-హీరోయిన్, దర్శకుడు-హీరోయిన్.. ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని జంటలు మాత్రమే సినిమా తెరపై పంచుకున్న ప్రేమను నిజ జీవితంలోకి తెచ్చుకుంటాయి. అలా కళతో పరిచయమై కలల జీవితాన్ని ప్రారంభించిన స్టార్ కపుల్స్ గురించి తెలుసుకుందామా
2000లో మహేశ్ బాబు ‘వంశీ’ సినిమాతో
మహేశ్-నమ్రతల మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ సినిమా పూర్తయ్యే సరికి వీరు ప్రేమికులుగా మారిపోయారు.
మహేశ్- నమ్రత
ఆ తర్వాత 5 ఏళ్లు ప్రేమపక్షుల్లా విహరించి…2005 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. మహేశ్ పెళ్లి అప్పట్లో అమ్మాయిలకు షాకింగ్ వార్త అనే చెప్పాలి. ఇదే పాయింట్‌తో అష్టా-చెమ్మా అనే సినిమా కూడా వచ్చింది.
దాదాపు నాలుగేేళ్లు ప్రేమ ప్రయాణం చేసి ఒక్కటైందీ ప్రేమ జంట. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు.
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ
ఆ పరిచయమే ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం ఆది కుటుంబ కార్యక్రమంలో నిక్కీ కనిపించడంతో వీరి ప్రేమ ప్రపంచానికి తెలిసింది. గతేడాది మేలోనే వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి జెనీలియా. 2003లో ఓ టెస్ట్ షూట్‌లో రితేశ్ దేశ్‌ముఖ్‌ను కలిసింది.
జెనీలియా - రితేశ్ దేశ్‌ముఖ్
ఆ తర్వాత వారు తెరంగేట్రం చేసి ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో ప్రేమ పావురాలుగా మారారు.
2012 ఫిబ్రవరి 3న ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరు మరాఠీ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయల్లో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.
బెంగళూరు అమ్మాయి అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్. వృత్తిపరంగానే వీరిద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ గతేడాది నవంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
నాగశౌర్య - అనూష శెట్టి
చాలాకాలం ప్రేమాయణం కొనసాగించాక గతేడాది జూన్‌లోనే ఈ జంట కూడా పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ అందరిలా ఈ జంట తమ ప్రేమను దాచలేదు. కలిసి సందడి చేస్తూ అభిమానులను అలరిస్తూనే వచ్చారు. తమిళనాడులోని మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
నయనతార - విగ్నేశ్ శివన్
కాస్త విచిత్రంగా జరిగిన ఈ పరిచయం పెళ్లిదాకా వచ్చింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ‘నీకు బాలీవుడ్‌లో నచ్చే అబ్బాయి ఎవరు?’ అని కరణ్‌జోహార్ కత్రినాని అడగ్గా ‘విక్కీ కౌశల్’ అంది కత్రినా. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం..గతేడాది మార్చిలో పెళ్లి చకచకా జరిగిపోయాయి.
విక్కీ కౌశల్- కత్రినా కైఫ్
ఈ స్టార్‌కిడ్స్ కూడా చాలాకాలమే ప్రేమపక్షుల్లా విహరించారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఇజ్రాయెల్ వెళ్తున్నపుడు మొదలైన పరిచయం.. ‘బ్రహ్మాస్త’ సమయానికి ముదిరింది.గతేడాది ఏప్రిల్‌లో ఏడడుగులు వేశారు. ఈ జంటకు ఓ బిడ్డ జన్మించింది కూడా.
రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్
సూపర్ హిట్ సాంగ్ ‘కజ్రారే’ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. 2007లో వచ్చిన గురు సినిమా తర్వాత అభిషేక్ ప్రపోజ్ చేయగా ఐశ్వర్య అంగీకరించింది. 2007లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్
సోషల్ మీడియాలో ఈ జంట బాగా పాపులర్. బాలీవుడ్ ముచ్చట్ల ప్రకారం ‘రామ్‌లీలా’ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ చూస్తే మనకూ అదే అనిపిస్తుంది. 2018 నవంబర్‌లో ఇటలీలో కొంకణి, సింధి సంప్రదాయాల్లో వీరు పెళ్లి చేసుకున్నారు.
దీపికా పదుకుణే - రణ్‌వీర్ సింగ్
2015లో వచ్చిన బాలివుడ్ సినిమా ‘అలోన్’తో వీరిద్దరూ పరిచయమయ్యారు. అప్పటికే బ్రేకప్‌లో ఉన్న వీరిద్దరూ ఒకరి సాంగత్యంలో మరొకరు ప్రేమను పొందారు. 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
బిపాషా బసు - కరణ్ సింగ్
ఇద్దరి మధ్య పదేళ్ల వయసు అంతరం ఉన్నా..ప్రేమ ఈ జంటను కలిపింది. 2008లో ప్రేమలో పడ్డారు 2012లో పెళ్లి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్
చాలా సినిమాల్లో ఆన్‌స్క్రీన్‌పై కపుల్స్‌గా అద్భుతంగా మెరిసిన ఈ జంట 1999లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
కాజోల్ - అజయ్ దేవ్‌గణ్
ఈ కాలం జంటలే కాదు…బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచే రీల్ టు రియల్ లైఫ్ ప్రేమకథలు నడుస్తున్నాయి. అందులో అందులో ఎన్నో టాలివుడ్ బాలివుడ్ ప్రేమ జంటలు ఉన్నాయి.
సీనియర్ ప్రేమజంటలు
యువసామ్రాట్, శివ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఈ ఆన్‌స్క్రీన్ జంట 1992లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమల సినిమాలు వదిలేశారు. జంతు ప్రేమికురాలైన అమల కోసం నాగార్జున తన కారులో లెదర్ సీట్లను కూడా తొలగించారు.
నాగార్జున - అమల
శ్రీకాంత్, ఊహ కలిసి చేసిన తొలి సినిమా ‘ఆమె’. ఊహను ఇష్టపడిన శ్రీకాంత్ ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లికి ఒప్పించారు. ‘ఆయనగారు’ సినిమా తర్వాత శ్రీకాంత్, ఊహకు ఆయనగారిగా మారిపోయారు. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్దబ్బాయి రోషన్ ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెట్టాడు.
శ్రీకాంత్ - ఊహ
మణిరత్నం- సుహాసిని, వంశీ రమ్య కృష్ణ,
కృష్ణ- విజయ నిర్మల, శరత్ బాబు-రమాప్రభ ఇలా రీల్ టు రియల్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన జంటలు చాలానే ఉన్నాయి.