Vani Jairam: వాణీ జయరామ్‌కు పేరు తెచ్చిన సూపర్ హిట్ పాటలు ఇవే..

YouSay Short News App

గాయని వాణి జయరాం తన కెరీర్లో 10వేలకు పైగా పాటలను పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, హిందీ తదితర భాషలతో కలిపి మొత్తం 19 భాషల్లో ఆమె పాటలను ఆలపించారు. ఒక్క తెలుగులోనే వెయ్యికి పైగా పాటలు పాడారు.

వాణి జయరాం తెలుగులో శంకరాభరణం, ఘర్షణ, శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం, సీతాకోకచిలుక వంటి సినిమాల్లో వాణి జయరాం పాటలు పాడారు. ఆమె పాడిన అత్యుత్తమ పాటలేంటో చూద్దాం.

ఎన్నెన్నో జన్మల బంధం..

1975లో విడుదలైన పూజ సినిమాలో ఆమె  మూడు పాటలు పాడారు. అందులో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాట ఇప్పటికీ శ్రోతల చెవుల్లో మార్మోగుతుంటుంది.

యే తీరుగా, పలుకే బంగారమాయెనే..

శంకరాభరణం సినిమాలో దాదాపుగా అన్ని పాటలను ఆమెనే ఆలపించారు. ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ‘దొరుకున ఇటువంటి సేవ’, ‘బ్రోచేవారెరవరురా’, ‘పలుకే బంగారమాయెనా’, ‘యే తీరుగా నను’ పాటలను ఆలపించారు. ఇప్పటికీ ఇవి వింటే తెలియన ప్రశాంతత చేకూరుతుంది.

మిన్నేటి సూరీడు వచ్చెనెమ్మా..

1981లో విడుదలైన సీతాకోక చిలుకలోని ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా’ పాట బాగా పాపులర్ అయింది. సాగర సంగమమె(ఫీమేల్), అలలు కలలు(డుయెట్, సోలో) పాటలను కూడా వాణి జయరాం ఆలపించారు.

ఒక బృందావనం…

‘ఒక బృందావనం.. సోయగం’ అంటూ సాగే ఈ పాటను ఆలపించింది వాణినే.  1988లో వచ్చిన ఘర్షణ సినిమాలోనిదీ గీతం. ‘రోజాలో లేతవన్నెలే’, ‘కురిసెను విరజల్లులే’ పాటలను కూడా ఆమె పాడారు.

అందెల రవమిది…..

స్వర్ణకమలం సినిమాలోని ‘అందెల రవమిది’ పాటను పాడింది కూడా వాణినే. ఈ పాట నేటికీ సంగీత ప్రియుల చెవుల్లో మార్మోగుతుంది.

శ్రుతి నీవు.. గతి నీవు..

స్వాతికిరణం సినిమాలోని మొత్తం పాటలను ఆమె ఆలపించారు. ఇందులోని ‘శ్రుతి నీవు గతి నీవు’, ‘ప్రణతి ప్రణతి’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

మరిన్ని..

1987లో వచ్చిన శ్రుతిలయలు సినిమాలో ఆమె మూడు పాటలు పాడారు. ‘ఇన్ని రాశుల యునికి, ‘శ్రీ గణనాథం’, ‘ఆలోకయే శ్రీ బాల’ గీతాలను ఆలపించారు. మంగమ్మగారి మనవడులోని  ‘శ్రీ సూర్యనారాయణ’ పాటను పాడారు.

For More  Web stories