వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని

YouSay Short News App

వాణీ జయారామ్ అసలు పేరు కళావాణి

తమిళనాడులోని వెళ్లూరులో దొరైస్వామి అయ్యాంగార్, పద్మావతి దంపతులకు 1945లో జన్మించారు

తెలుగుతో పాటు 19కి పైగా భాషల్లో పాటలు పాడారు.

సుమారు వేయి సినిమాలలో 20,000 పాటలకు నేపథ్యగానం చేశారు. వేల సంఖ్యలో భక్తి గీతాలను ఆలపించారు

సంగీతంలో దిట్ట

కర్నాటక సంగీతంలో ఆమె దిట్ట. కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్ కర్ణాటక సంగీతం అభ్యసించారు.

హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.

తొలిపాట

తెలుగలో ఆమె తొలిపాట  అభిమానవంతులు  చిత్రం(1973)లోని "ఎప్పటివలెకాదురా నా స్వామి"

పూజ (1975) చిత్రంలోని వాణీ జయరామ్ పాడిన పాటలు ఆమెకు గుర్తింపునిచ్చాయి.

"పూజలు చేయా", "ఎన్నెన్నో జన్మల బంధం" పాటలు హిట్‌గా నిలిచాయి. తెలుగు చిత్రసీమలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి.

కె. విశ్వనాథ్  డైరెక్ట్ చేసిన శంకరాభరణం (1979)లో వాణీ జయరామ్‌  ఐదు పాటలు పాడారు.

ఈచిత్రానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు, ఉత్తమ నేపథ్య గాయనిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా అందుకున్నారు.

సీతామాలక్ష్మి (1978), శృతిలయలు (1987) చిత్రాల్లో పాటలు పాడారు.

నిర్మాతగా

స్వాతి కిరణం(1990) చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమాలో వాణీ జయరామ్  పాడిన అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రానికి ఆమె మూడవ సారి జాతీయ చలనచిత్ర అవార్డును  పొందారు.

K. V. మహదేవన్‌, ఇళయరాజా, రాజన్-నాగేంద్ర, సత్యం, చక్రవర్తి వంటి అగ్ర సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.

అవార్డులు

వాణీ జయరామ్ జాతీయ చలనచిత్ర అవార్డులలో మూడు సార్లు, తెలుగు చిత్రాలకు రెండుసార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా ట్రోఫీని సొంతం చేసుకున్నారు.

వాణీ జయరామ్ తెలుగు సినిమా సంగీతంపై విపరీతమైన ప్రభావం చూపారు.