వీరసింహారెడ్డి... బాలయ్య ఫ్యాన్స్‌కి సంక్రాంతి విందు భోజనం
YouSay Short News App
గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్‌తో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతి వేళ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఓసారి సమీక్షిద్దాం.
వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి
(సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు.
కథ
ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
మరోవైపు జయసింహ(జూ.బాలయ్య) విదేశాల్లో తన తల్లి హనిరోజ్‌తో కలిసి జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఈష( శృతిహాసన్)తో ప్రేమలో పడుతాడు.
అసలు వీరసింహారెడ్డి తన భార్యకు ఎందుకు దూరమయ్యాడు. ప్రాణంగా భావిస్తున్న చెల్లి భానుమతి ఎందుకు చంపాలనుకుంది. జూ.బాలయ్య తన తండ్రి కోసం ఏం చేశాడు అనే కథను థియేటర్లలో చూడాల్సిందే.
రెండు పాత్రల్లో నటించిన బాలయ్య ఆ పాత్రలకు జీవం పోశాడు. తనదైన మాస్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లలో బాలయ్య భావోద్వేగం పండించాడు.
తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన హనీ రోజ్ నటనలో జీవించింది. వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన మెస్మరైజింగ్ నటనతో మెప్పించాడు. హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్ గ్లామరస్ నటనతో ప్రేక్షకులకు కనులవిందు చేసింది.
గోపీచంద్ మలినేని మంచి కథే తీసుకున్నప్పటికీ.. స్టోరిని ఎగ్జిక్యూట్ చేయడంలో కొన్ని చోట్ల తడబడ్డాడు. కొన్నియాక్షన్ సీన్లు మరి ఓవర్‌గా అనిపిస్తాయి. మాస్ డ్రామాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
సాంకేతికంగా సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉంది. సినిమాటోగ్రాఫి బాగుంది. కొన్ని సీన్లలో స్క్రీన్ ప్లే లోపించినప్పటికీ గోపిచంద్ టెకింగ్ పర్వాలేదు.
సాంకేతికాంశాలు
తమన్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ . BGM సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్‌లో బాలయ్య డ్యాన్స్ అదిరింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.
‘వీరసింహారెడ్డి’... బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతికి మంచి విందు భోజనంలాంటి సినిమా. బాలయ్య డైలాగ్స్, శృతిహాసన్ గ్లామర్, హనిరోజ్ నటన మెప్పిస్తుంది.
చివరగా..
స్లోనరేషన్, అనవసర సన్నివేశాలు లేకపోయి
ఉంటే వీరసింహారెడ్డి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేది.