విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం

YouSay Short News App

థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు

‘ఖుషీ’ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు అందరికీ తెలుసు కదా?

‘ఖుషీ’ చిత్రం విడుదల కావడానికి ఇంకా 3 నెలల సమయం పట్టొచ్చు. ఆలోగా వీరిద్దరూ వేర్వేరుగా నటించిన అద్భుత ప్రేమ కథా చిత్రాలు చూసి ఎంజాయ్ చేయండి.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. సినీరంగంలో విజయ్ దేవరకొండ ఎదిగేందుకు ఈ చిత్రం మంచి ప్లాట్ ఫాం అందించింది. 

అర్జున్ రెడ్డి

ఈ చిత్రంలోని ప్రేమ కథ యువకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. అభిప్రాయ బేధాలు, స్నేహం, తండ్రి ప్రేమ, ఒంటరితనం, హార్ట్ బ్రేకింగ్ వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.

గౌతమ్ మీనన్ రూపొందించిన అద్బుత లవ్ స్టోరీనే ‘ఏ మాయ చేశావే’. ఈ సినిమాతోనే సమంత తెలుగులో ఆరంగ్రేటం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. 

ఏ మాయ చేశావే

ఈ సినిమాలో సమంత మాజీ భర్త నాగచైతన్య హీరోగా నటించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే లవ్ స్టోరీ మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఉంటుంది. సమంత నటించిన సినిమాల్లో మ్యూజికల్‌గా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.

‘గీత గోవిందం’ చిత్రంలో అమాయకపు యువకుడిగా విజయ్ దేవరకొండ నటించి మహిళల హృదయాలు గెలుచుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ ప్రేక్షకులను దృష్టి మరల్చనీయదు. ఈ సినిమా తర్వాత నుంచే రష్మిక, విజయ్‌ల మధ్య డేటింగ్ నడుస్తోందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

గీత గోవిందం

గౌతమ్ మీనన్ రూపొందించిన మరో అద్భుత ప్రేమ కావ్యమే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. సమంత, నాని సినిమాలో వారి క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. 

ఎటో వెళ్లిపోయింది మనసు

‘ప్రియతమా నీవచట కుశలమా’ సాంగ్‌ను ఇళయరాజా మరోసారి కంపోజ్ చేశారు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. నాని, సమంతల కిస్ సీన్ అప్పట్లో పెద్ద సెన్షేషన్.

విజయ్ దేవరకొండ చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఒక ఆణిముత్యంగా నిలిచిపోయింది. కానీ ప్రేక్షకుల్లో ఈ సినిమా అంతగా నాటుకుపోలేదు. .

డియర్ కామ్రేడ్

బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పాల్సింది ఈ మూవీ. నేల టికెట్ ప్రేక్షకులను మాత్రం తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్, రష్మిక మరోసారి తెరపై మాయ చేశారు.

‘అ ఆ’ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. గురూజీ త్రివిక్రమ్ యధావిధిగా తన మార్కు రచన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ చిత్రంలో నితిన్, సమంత కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

అ ఆ

నాగచైతన్య నటించిన చిత్రాల్లో ‘మజిలీ’ ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటించింది.

మజిలీ

ప్రేమలో విఫలమై బాధ్యత పట్టని యువకుడిగా నాగచైతన్య ఈ చిత్రంలో నటించాడు. సమంత వన్‌సైడ్ లవర్‌గా యాక్ట్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం అద్భుతం. ప్రతి సీన్‌లో ప్రేమ కనిపిస్తుంది.

తమిళ మూవీ ‘96’కు రీమేక్‌గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్‌తో సినిమా నిర్మించారు.

జాను