Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?

YouSay Short News App

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు విభిన్న వస్త్రధారణలో హాజరై ఈ మహిళ అందరినీ ఆశ్చర్య పరిచింది.

భిన్నమైన తలపాగా, మెడలో రుద్రాక్ష, ఒంటినిండా ఆభరణాలు, సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టుతో ఈమె దర్శనమిచ్చింది.

యుఎన్ సమావేశాల్లో పాల్గొన్న ఈ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అయితే, సమావేశాల్లోనే తాను ‘విజయప్రియ నిత్యానంద’ అంటూ పేరు చెప్పేసింది ఈ మహిళ.

నిత్యానంద స్వయం ప్రకటిత దేశమైన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’(USK) ప్రాంతానికి యుఎన్ శాశ్వత రాయబారిగా హాజరయ్యానంటూ ప్రసంగానికి  ముందు పరిచయం చేసుకుంది.

సమావేశాలకు హాజరైన ‘విజయప్రియ నిత్యానంద’ లింక్‌డ్‌ఇన్ ప్రొఫైల్‌లోని సమాచారం ప్రకారం ఆమె ఏ దేశానికి చెందిన వారో స్పష్టమైన వివరాలు లేవు. 2014లో కెనడాలో బీఎస్సీ పూర్తి చేసింది.

దేశమంటూ లేదు..

2013, 14లో ఇంటర్నేషనల్ యూజీ స్కాలర్‌షిప్‌ని పొందినట్లు లింక్‌డ్‌ఇన్‌లో పేర్కొంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్, పిజెన్, క్రియోల్ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు.

నాలుగు భాషల్లో ప్రావీణ్యం..

జెనీవా సమావేశాల్లో పాల్గొన్న విజయప్రియ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సార్వభౌమ దేశ స్థాపకుడు ‘నిత్యానంద’ పరమశివంను భారత్ వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ వీడియోను యుఎన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

భారత్‌పై ఆరోపణలు..

యుఎన్ వీడియో పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి మద్దతుగా నిలుస్తున్నారా? నిత్యానంద ‘కైలాస’ను దేశంగా గుర్తిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

యుఎన్ వెబ్‌సైట్లో వీడియో..

భారతీయుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఒక దేశ ప్రతినిధిగా కాదని, కేవలం ఒక ఎన్జీవో ప్రతినిధిగానే ‘విజయప్రియ నిత్యానంద’ హాజరైనట్లు యుఎన్ క్లారిటీ ఇచ్చింది.

ఎన్జీవోగానే..

నిత్యానంద స్వామీ 2019లో భారత్‌ను విడిచి పారిపోయాడు. అత్యాచార(రేప్), అపహరణ(కిడ్నాప్) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ను పవిత్ర హిందూ దేశంగా ప్రకటించాడు.

పారిపోయిన నిత్యానంద..

సెంట్రల్ అమెరికా పరిధిలోని ఈక్వెడార్ దీవుల్లో ఓ ఐలాండ్‌ని నిత్యానంద కొనుగోలు చేశాడు. దీనినే ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’గా ప్రకటించాడు.

ఐలాండ్..

నిత్యానంద తమిళనాడులో జన్మించాడు. ఇతడి అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తనకు 12ఏళ్లకే జ్ఞానోదయమైందని తన ప్రవచనాల్లో చెబుతుంటాడు.

అసలు పేరు..

ఓ సెలబ్రిటీతో రాసలీలలు జరపుతున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. దీనిని కవర్ చేసుకోవడానికి నిత్యానంద ప్రయత్నించి విఫలమయ్యాడు.

రాసలీలలు..

ఓ మైనర్ బాలికను నిర్బంధించి వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో దేశాన్ని విడిచి నిత్యానంద పరారయ్యాడు. అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

బాలిక నిర్బంధంతో..

‘కైలాస’ దేశంలో నిత్యానంద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తనను ప్రధానిగా ప్రకటించుకున్నాడు. మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశానికి గుర్తింపునివ్వాలని ఐరాసను ఎప్పటినుంచో కోరుతున్నాడు.

ప్రధాని నిత్యానంద..

నిత్యానంద స్వయం ప్రకటిత దేశమైన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’(USK)ను దేశంగా గుర్తించట్లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

దేశం కాదు..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.