కిరణ్ అబ్బవరం నటించిన వినరోభాగ్యము విష్ణకథ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్‌లో ఇచ్చిన జోష్ సినిమాలో కనపడిందా ఓసారి చిత్రాన్ని సమీక్షిద్దాం
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత దగ్గర పెరిగిన విష్ణు (కిరణ్ అబ్బవరం) ఎదుటి వారికి చేతనైన సహాయం చేయాలనుకుంటుంటాడు కలవాడు. నంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో యూట్యూబర్ దర్శన(కశ్మీరి పరదేశీ) విష్ణుతోపాటు శర్మ (మురళీ శర్మ)తో స్నేహం చేస్తుంది.
కథ
విష్ణు, దర్శన మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో శర్మను దర్శన తుపాకితో కాల్చి చంపి జైలుకు వెళ్తుంది.
స్నేహంగా ఉన్న శర్మను దర్శన ఎందుకు కాలుస్తుంది? దర్శన నిర్ధోషి అని చెప్పడానికి విష్ణు ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు?
ఈక్రమంలో టెర్రరిస్ట్‌ను విష్ణు ఎందుకు కలుస్తాడు? దేశం కోసం విష్ణు చేసిన పని ఏమిటి? అనేది మిగిలి కథ
లైబ్రేరియన్ విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో జీవించాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఇంకొంచెం మెరుగుపడాల్సి ఉంది. దర్శనగా కాశ్మీర పరదేశీ మెప్పించింది. స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది.
ఎవరేలా చేశారు?
శర్మ పాత్రంలో మురళీ శర్మ ఒదిగిపోయారు. ఆయన చేసే రీల్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆయన నటన..వేసిన స్టెప్పులు ప్రతీది నవ్విస్తుంది.
హీరో తాతగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, ఆమని. టెర్రరిస్ట్ రాజన్‌గా శరత్ లోహితన్యతో పాటు ఇతర నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుని కొత్త కాన్సెఫ్ట్‌తో సినిమాను తీయడంలో విజయం సాధించాడు.
ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథను డీల్ చేసిన విధానం బాగుంది.
దర్శకత్వం
ఎక్కడ కొత్త దర్శకుడు అని అనిపించదు. లవ్, ఎమోషన్ డ్రామా, దేశభక్తి వంటి మూడు లేయర్లను మిక్స్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్. బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు.
కొన్ని చోట్ల సీన్లకు నేపథ్య సంగీతం మంచి హైప్‌ను ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌ల పనితీరు బాగుంది. సాంగ్స్‌లో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి.
సాంకేతికంగా
సెకండాఫ్‌లో సాగదీసే కొన్ని సీన్లు
కిరణ్‌తో అవసరానికి మించి చెప్పించిన డైలాగ్స్
బలహీనతలు
ఫస్టాఫ్‌లో ట్విస్టులుకథలో కొత్తదనంసంగీతంమురళి శర్మ కామెడీకిరణ్ అబ్బవరం నటన
బలాలు
రేటింగ్: 3.25/5
ఈ వీకెండ్‌లో ట్విస్టులతో కూడిన సినిమా చూడాలనుకునేవారికి మంచి ఎంటర్‌టైనర్
ఫైనల్‌గా
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.