BTS V అంత పాపులర్‌ మన విరాట్‌, అనుష్క శర్మ కన్నా పాపులర్ ఉర్ఫీ జావెద్‌

YouSay Short News App

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో వెతికిన వారిలో ఆసియా నుంచి విరాట్‌ కోహ్లీ టాప్‌లో నిలిచాడు. రన్ మెషిన్ ఫామ్‌లోకి వచ్చి పరుగుల వరద పారించడంతో ఎక్కువ మంది శోధించారు.

ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుక్, ప్రియాంక చోప్రా ఉన్నారు. టాప్ 25లో సౌత్ నటులు సమంత, రష్మిక, అల్లు అర్జున్‌కు చోటు దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బీటీఎస్ బ్యాండ్ సభ్యుడే తైహోంగ్. ఇతడిని V అని పిలుస్తుంటారు. హస్కీ వాయిస్‌తో మెప్పిస్తున్న గూగుల్‌లో అత్యధికంగా వెతికినవారిలో ఇతడే టాప్‌లో ఉన్నాడు. ఇదే బ్యాండ్‌కు చెందిన జంగ్ కూక్  తర్వాత స్థానంలో ఉన్నాడు.

తైహోంగ్(V)

ఈ ఏడాది మెుత్తం కోహ్లీ నామ జపమే. ఆసియా కప్‌లో సెంచరీ కొట్టినప్పటి నుంచి మెుదలుకొని పాకిస్థాన్‌తో మర్చిపోలేని ఇన్నింగ్స్ వరకు కింగ్‌ కోహ్లీదే హవా. మరి అంతలా మార్మోగిన అతడి గురించి వెతక్కుండా ఉంటారా? ఆసియాలో టాప్‌ 3 ప్లేస్‌లో నిలిచాడు

కోహ్లీ... కోహ్లీ…కోహ్లీ

బాలీవుడ్ సోయగం కత్రినా కైఫ్‌ విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచింది. పెద్దగా సినిమాలు ఏం చేయకపోయినా ఆమె గురించి శోధించారట. గతేడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. దాని ప్రభావంతో పాటు బ్యూటీ అవార్డును గెలుచుకుంది.

ది క్యాట్‌

అందాల తార అలియా భట్ టాప్‌ 5లో చోటు దక్కించుకుంది.ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి పాప కూడ జన్మించింది. దీంతో పాటు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర హిట్ టాక్‌ ఆమె గురించి వెతకడానికి కారణమయ్యాయి.

అలియా భట్

బాలీవుడ్ బ్యాచ్‌లర్‌ సల్మాన్ ఖాన్ గురించి గూగుల్‌లో వెతక్కపోతే ఆశ్చర్యం. ఈ కండల వీరుడు ప్రపంచవ్యాప్తంగా వెతికిన ఆసియన్స్‌లో 7వ స్థానంలో నిలిచాడు. తెలుగులో ఇటీవల చిరంజీవి గాడ్‌ ఫాదర్‌లో మెరిశాడు.

సల్మాన్ ఖాన్‌

నిక్ జోన్స్‌ను వివాహం చేసుకున్నప్పటి నుంచి హాలీవుడ్‌కు పరిమితమైన సిజ్లింగ్ బ్యూటీ. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా అభిమానులు ఆమె గురించి చాలానే వెతికారు. ప్రపంచవ్యాప్తంగా సెర్చ్‌ చేసిన ఆసియన్స్‌లో టాప్ 10లో నిలిచింది.

ప్రియాంక చోప్రా

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్, అల్లుఅర్జున్, సమంత, రష్మిక మందన్నా గురించి కూడా చాలా మందే వెతికారు.

దక్షిణాది ప్రియులు

వివాహం చేసుకున్న తర్వాత కాజల్ ఇంటికే పరిమితం అయ్యింది. సినిమాల్లో నటించకపోయిన కాజల్ గురించి తెలుసుకోవాలని కొందరు తాపత్రయ పడ్డారు. అందుకే ఆమె టాప్ 15లో ఉన్నారు. ఆమె తర్వాత ఇక్కడ్నుంచి సమంత చోటు దక్కించుకున్నారు.

కాజల్‌ అగర్వాల్‌

పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ గురించి సెర్చ్ చేయటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఏడాది మెుత్తం తగ్గేదేేలే ఫీవర్ నడిచింది మరి. అంతేకాదు, హీరోయిన్ రష్మిక మందన్నా కూాడ టాప్ 25లో నిలిచింది.

అల్లు అర్జున్

బిగ్‌బాస్‌ బ్యూటీ, విచిత్ర వేషధారణతో పాపులర్‌ అయిన ఉర్ఫీ జావెద్‌, తమన్నా, కాజోల్‌, అనుష్క శర్మ, సచిన్‌, సూర్య, ధనుష్‌ వంటి బిగ్‌ స్టార్స్‌ కంటే ముందుంది. ఆమె కోసం అంతగా వెతికారు మరి.

ఉర్ఫీ జావెద్‌