ws_Snapinsta.app_352193427_662922349008188_404853143679724237_n_1024

Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!

YouSay Short News App

టీమిండియా క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ప్రస్థానం చెరగని అధ్యాయం. క్రికెటర్‌గా విరాట్ ఎంతో సుపరిచితం. అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ టీమిండియాకు కీ ప్లేయర్‌గా ఉన్నాడు.

క్రికెటర్‌గా ఎలా ఉంటాడో కోహ్లీని ఊహించుకోగలం. కానీ, దశావతారాలు వేస్తే ఎలా ఉంటాడన్నది ఏఐ చేసి చూపించింది.

ws_Snapinsta.app_352193427_662922349008188_404853143679724237_n_1024

విరాట్ కోహ్లీకి కింగ్ అని బిరుదు. నిజంగా రాజు వేషం వేస్తే ఇలా ఉంటాడట.

విరాట్‌లో ఓ వ్యోమగామి(ఆస్ట్రోనాట్)ని ఊహించుకుని ఏఐ ఈ చిత్రాన్ని గీసింది.

కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే మక్కువ. ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడతాడు. మరి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయితే ఇలా ఉంటాడు.

గిటార్ ప్లేయర్‌గా విరాట్‌ని ఏఐ చాలా అందంగా చూపించింది.

విరాట్ కోహ్లీ డాక్టర్ అయితే ఇలా ఉంటాడా అని అనిపిస్తోంది కదూ.

కోహ్లీకి దేశభక్తి ఎక్కువ. దేశానికి సేవలందించే భాగ్యం కలిగితే ఇలా సైనికుడవుతాడు.

విరాట్ కోహ్లీ కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుందో ఏఐ ఊహించి చిత్రాన్ని గీసింది.

ఛేజింగ్‌లో విరాట్ పోరాట యోధుడు. యుద్ధంలో పోరాట యోధుడి పోజు ఇలాగేే ఉంటుందేమో.

విరాట్ ఓ ఫైటర్. మరి, ఈ ఫైటర్ మరో ఫైటర్ జెట్(యుద్ధ విమానం) పైలట్ అవతారమెత్తితే విజయమే.

ఖాకీ దుస్తుల్లో విరాట్ ఠీవీగా కనిపిస్తున్నాడు. నేరస్థులకు నరకాన్ని చూపిస్తా అంటూ పోజు పెట్టాడు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran