REVIEW: విశాల్‌ “లాఠీ”తో మెప్పించాడా? లేదా?

YouSay Short News App

తమిళ హీరో విశాల్ చాలారోజులుగా మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. తన మార్క్‌ యాక్షన్‌తో ఆకట్టుకునే ఈ హీరో… మరోసారి అచ్చొచ్చిన పోలీసు పాత్రను ఎంచుకున్నాడు. అధికారిగా కాదు.. కానిస్టేబుల్‌ పాత్రలో నటించి లాఠీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా కోసం షూటింగ్‌లో గాయాలపాలైనా పట్టించుకోలేదు. మరి లాఠీతో విశాల్ మెప్పించాడా? ట్రైలర్‌, పాటలతో ఆకట్టుకున్న చిత్రం హిట్ టాక్ తెచ్చుకుందా? ఇప్పుడు చూద్దాం.

సాధారణ జీవితం గడిపే విశాల్ కష్టపడి పోలీస్ కానిస్టేబుల్‌గా ఎదుగుతాడు. అనుకోకుండా ఒకరోజు సమస్యల్లో చిక్కుకోవడం. కేవలం కానిస్టేబుల్‌గా ఉండి తనకున్న పరిధిలోనే చిక్కులను చేధించడం. ఆపై విలన్లను చీల్చి చెండాడటం  సినిమా కథ

కథ

సినిమాలో పాత్రల పరిచయానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అంతేకాదు, ఫస్టాఫ్ మెుత్తం సాదాసీదా సన్నివేశాలతోనే ముగుస్తుంది. ఎక్కడా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్, అక్కడక్కడా కామెడీతో లాగించేశాడు.

అటు ఇటుగానే

సినిమాలో ఏం లేదని సగటు ప్రేక్షకుడు అనుకునేలోగా సెకాండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పోరాట ఘట్టాలతో సీన్లు చకచకా సాగిపోతుంటాయి. విశాల్‌ మార్క్ యాక్షన్‌ సీన్స్ అదరిపోతాయి. మాస్‌ ఎంటర్‌టైన్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సెకాండాఫ్ ఫుల్ మీల్‌

మలుపు

విశాల్ పర్సనాలిటీకి యాక్షన్ తోడైతే ఎలా ఉంటుంది. సరిగ్గా అలానే మరోసారి విశాల్ విశ్వరూపం చూపించాడు. ఫైట్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుత నటన జనాలను మెప్పిస్తుంది. సినిమా మెుత్తాన్ని భుజాలపై మోసాడంటే నమ్మాల్సిందే.

విశాల్ విశ్వరూపం

హీరోయిన్ సునైనాకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రభు కూడా నటించినప్పటికీ తన పాత్రకు న్యాయం చేశాడంతే.

మిగతా నటీనటులు

సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. కొన్ని సన్నివేశాలను మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పాటలు ఓకే. అంతకన్నా ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను అతడి బ్యాక్‌గ్రౌండ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు.

సాంకేతిక నిపుణులు

సినిమా దర్శకుడు ఏ వినోథ్ కుమార్ తొలి సినిమా ఇది. అక్కడక్కడ అనుభవం  లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ ప్లేపై మరింత దృష్టి సారించాల్సింది. కొన్ని సీన్లు లాజిక్‌కు అందవు. కాస్త శ్రద్ధ వహించి ఉంటే ఇంకా బాగుండేది.

దర్శకుడు

విశాల్ నటన BGM, యాక్షన్ సీన్స్‌

ప్లస్  పాయింట్స్‌

కథ, స్క్రీన్‌ప్లే లాజిక్‌కు అందని సీన్లు

మైనస్ పాయింట్స్

రేటింగ్: 2.5 / 5

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.