రూ.150 కోట్ల క్లబ్‌లోకి బాస్‌ ‘వాల్తేరు వీరయ్య’ 

ఈ క్లబ్‌కు బాస్‌ మాత్రం మహేశ్‌ బాబు!

YouSay Short News App

సంక్రాంతికి విడుదలైన బాస్‌ చిరంజీవి  చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రూ.150 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. టాలివుడ్‌లో ఇప్పటిదాకా 19 సినిమాలు రూ.150 కోట్ల మార్కును దాటాయి.

₹150కోట్ల మార్క్ దాటడమంటే చిన్న విషయం కాదు, ప్రమోషన్లతో పాటు హీరోకు అంత మార్కెట్‌ ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నది మహేశ్‌ బాబు.

           హీరో           -      సినిమాలు         మహేశ్‌బాబు      -         5         ప్రభాస్‌             -        4         చిరంజీవి           -        3         అల్లు అర్జున్        -        2         రామ్‌ చరణ్‌        -        2         ఎన్టీఆర్‌            -         2         పవన్‌ కల్యాణ్       -        1

₹150 కోట్ల సినిమాలు

150 కోట్ల క్లబ్‌కు బాస్‌ మహేశ్ బాబే ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా 150 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.

మహేశ్‌

           సినిమా           -     కలెక్షన్‌         సరిలేరు నీకెవ్వరు    -     237 కోట్లు         సర్కారు వారి పాట   -     192 కోట్లు         మహర్షి              -     184కోట్లు         భరత్‌ అనే నేను      -     178 కోట్లు         శ్రీమంతుడు          -     153కోట్లు   

ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్‌ నుంచే రావాలి.

ప్రభాస్‌

           సినిమా      -       కలెక్షన్‌         బాహుబలి-2    -     1749 కోట్లు         బాహుబలి-1     -     600 కోట్లు         సాహో          -     417 కోట్లు         రాధేశ్యామ్‌       -    151 కోట్లు 

ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.150 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్‌ హీరోలను దాటి 3 సినిమాలు 150 కోట్లు వసూలు చేయడం బాస్‌ క్రేజ్‌కు నిదర్శనం

చిరంజీవి

           సినిమా             -       కలెక్షన్‌         సైరా నరసింహా రెడ్డి    -    248 కోట్లు         ఖైదీ నం.150           -    166 కోట్లు         వాల్తేరు వీరయ్య        -    150 కోట్లు+ 

పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ ఆ సినిమా కంటే  ముందే 150 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.

అల్లు అర్జున్

     సినిమా                -       కలెక్షన్‌    పుష్ప-ది రైజ్‌             -    369 కోట్లు    అల వైకుంఠపురములో   -    274 కోట్లు

RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్‌, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.

రామ్‌ చరణ్‌

     సినిమా          -       కలెక్షన్‌      RRR            -    1131కోట్లు      రంగస్థలం        -    213 కోట్లు

RRRతో రామ్‌ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్‌. తనకున్న వాక్‌ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్‌ సొంతం చేసుకున్నాడు.

జూ. ఎన్టీఆర్‌

     సినిమా               -        కలెక్షన్‌      RRR                 -      1131కోట్లు      అరవింద సమేత       -      155 కోట్లు

టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో ఒకే సినిమా ఉండటం కాస్త ఆశ్చర్యమే కానీ త్వరలో ఆయన సినిమా లైనప్‌ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.

పవన్ కల్యాణ్

     సినిమా               -        కలెక్షన్‌      భీమ్లా నాయక్‌        -      161 కోట్లు

త్వరలో మరికొన్ని సినిమాలు ఈ క్లబ్‌లో చేరే అవకాశముంది. అందులో ఈ లిస్ట్‌లో ఉన్న అందరి సినిమాలు ఉన్నాయి.

అప్‌కమింగ్‌ 150cr మూవీస్‌

  ప్రభాస్‌  -   సలార్‌, ప్రాజెక్ట్‌ K, ఆది పురుష్

   హీరో    -      సినిమాలు

  మహేశ్‌ -   SSMB28, రాజమౌళి సినిమా

  అల్లు అర్జున్  -   పుష్ప-2

  రామ్‌ చరణ్‌  -  RC15

  పవన్ కల్యాణ్ -  హరిహర వీరమల్లు, సుజిత్‌,                    హరీశ్‌ శంకర్‌ సినిమాలు