వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూమెగా ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్
YouSay Short News App
ఆచార్య డిజాస్టర్, గాడ్‌ఫాదర్‌కు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల లేమితో ఇబ్బంది పడ్డ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు.
రవితేజతో జోడి, రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అభిమానుల అంచనాలను వాల్తేరు వీరయ్య అందుకున్నాడా? ఓసారి సినిమాను సమీక్షిద్దాం.
వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు.
కథ
వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాధం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు.
అక్కడ శృతిహాసన్‌తో పరిచయం ఏర్పడుతుంది. మరి చిరంజీవికి ఎదురైన విషాధం ఏమిటి? రవితేజ- చిరంజీవి మధ్య రిలేషన్ షిప్ ఎలాంటిది? డ్రగ్ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? అనే అంశాలు సినిమాలో చూడాల్సిందే..
మెగాస్టార్ చిరంజీవి తనదైన మాస్‌లుక్‌లో అదరగొట్టాడు. మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్ అదరిపోయింది. వింటేజ్ చిరంజీవిని గుర్తు చేశాడు. రవితేజ, చిరంజీవి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే..
పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ పర్ఫామెన్స్ అదిరిపోయింది. చిరంజీవితో పోటీపడి నటించాడు. శృతిహాసన్ గ్లామర్ పరంగాను పాత్ర పరంగాను మెప్పించింది. విలన్లుగా బాబి సింహా, ప్రకాశ్ రాజ్ తమ పాత్రల్లో జీవించారు. వెన్నెల కిశోర్, సప్తగిరి, రాజేంద్రప్రసాద్ కామెడీ ట్రాక్ బాగుంది.కేథరిన్ థ్రేసా తన క్యారెక్టర్‌కు న్యాయం చేసింది.
డెరెక్టర్ బాబీ తీసిన వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవి పాత చిత్రాలను గుర్తు చేస్తుంది. పాత సినిమాల్లో మెగాస్టార్ స్టైల్ లుక్స్ కనిపిస్తాయి. బాబీ సినిమా మెకోవర్ బాగుంది. కానీ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కామెడీ సీన్లు కూడా అన్ని చోట్ల నవ్వు తెప్పించవు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
సాంకేతికంగా సినిమా అన్ని కమర్షియల్ హంగులతో ఉంది. సినిమాటోగ్రాఫి బాగుంది. కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించినప్పటికీ బాబీ టేకింగ్ పర్వాలేదు.
సాంకేతికాంశాలు
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది.BGM సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. బాస్ పార్టీ, నీకు అందమెక్కువ, పూనకాలు లోడింగ్ పాటల మేకింగ్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.
మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పునకాలు లోడింగ్...
చివరగా..
రేటింగ్: 3.0/5
చిరంజీవి మాస్ యాక్టింగ్రవితేజ- చిరంజీవి మధ్య సీన్లుఇంటర్వెల్ ట్విస్ట్పాటలునిర్మాణ విలువలు