YouSay Short News App

సంక్రాంతికి అచ్చమైన తెలుగమ్మాయిలా మేకోవర్‌ కావాలా?

సంక్రాంతికి అదిరిపోయేలా తయారవ్వాలని అమ్మాయిలు ఇప్పటికే సిద్ధమవుతుంటారు. ట్రెండ్‌కు తగ్గట్లుగా ఓ మోడ్రన్‌ డ్రెస్‌, నగలు అన్నీ కొనేసి ఉంటారు.

కానీ ఒకప్పుడు సంక్రాంతికి లంగాఓణీ ధరించి, జడగంటలు వేసుకొని కొప్పు నిండా పూలు పెట్టుకొని ముగ్గులేస్తున్న అచ్చమైన తెలుగమ్మాయిలను చూసేందుకు అబ్బాయిలు పోటీపడేవారు.

తెలుగమ్మాయి అని ఊహించుకుంటే చాలు మనసులో కనిపించే రూపంలో మొదటిది లంగా ఓణీ. పెళ్లైన వారికి చీరకట్టు ఇచ్చే అందం.పడుచు వయసులో మగువలకు లంగా ఓణీ ఇస్తుంది.

లంగా ఓణీ

అతివలకు అందం పొడుగు జడ. అలాంటి పొడవాటి జుట్టుకు జడగంటలు తగిలిస్తే, అమ్మాయి నడకకు అవి నాట్యమాడుతుంటే.. కుర్రాళ్ల గుండెలు అదరహో అనాల్సిందే.

జడగంటలు

జడగంటలు తగిలించి సిద్ధం చేసిన కొప్పు నిండా పువ్వులు పెట్టుకుంటే ఆ లుక్కే వేరు. అందానికే అసూయ పుడుతుందేమో అనిపించేలా కనిపిస్తారు.

కొప్పు నిండా పూలు

సొగసుకు మెరుగుదిద్దాలంటే నడుముకు వడ్డానం తప్పనిసరి. ఇది లంగా ఓణీకి మరింత అందాన్ని తెస్తుందంటే నమ్మండి.

వడ్డానం

వేడుక ఏదైనా చెవులకు కమ్మల బుట్టాలు కచ్చితంగా ఉపయోగిస్తారు. వీటికి అంతటి పేరు ఉంది.. నిండుగా కనిపిస్తూ సాంప్రదాయ లుక్‌ తీసుకొస్తాయి.

కమ్మల బుట్టాలు

కమ్మల బుట్టాలకు అదిరిపోయే కాంబినేషన్‌ మాటీలు. వివిధ రకాల డిజైన్లలో దొరికే వీటిని కలిపి పెట్టుకుంటే బాగుంటుంది.

మాటీలు

సంప్రదాయబద్ధంగా తయారయ్యే వాటిలో పాపిడి బిల్ల కూడా ఒకటి. జుట్టు మధ్యలో నుంచి నుదురు వరకు పాపిడిబిల్ల తీసుకువచ్చే అందం అంతా ఇంతా కాదు.

పాపిడి బిల్ల

అందమైన వస్త్రాలు ధరించిన వేళ మెడలో హారం ధరిస్తేనే కదా అంత సుందరంగా కనిపించేది. బంగారమైన, ముత్యాలహారమైన అలా వేసుకున్నారంటే సింపుల్‌గా సూపర్‌గా ఉంటుంది.

హారం

సంక్రాంతి పండగకు సవ్వడి ఉండాలని పట్టీలు వేసుకుంటారు. చెంగుచెంగుమంటూ ఇళ్లు, వాడ తిరుగుతుంటే వచ్చే చప్పుడుకి ఫ్యాన్స్‌ అయిపోతారు.

పట్టీలు

లంగా ఓణీ కలర్‌లో గాజులను ఎంచుకుంటే సరి. చేతినిండా గాజులు వేసుకొని ముంగిట్లో ముగ్గులు పెడుతూ జాలువారిన ముంగుర్లను పైకి జరుపుతుంటే ఓ ఫొటో క్లిక్‌ భలే ఉంటుంది కదు.

గాజులు

వేడుకల్లో కచ్చితంగా కనిపించాల్సిన మెహందీని మహిళలు వదలరు అనుకోండి. మంచి డిజైన్‌లో వేసుకుంటే సూపర్‌ లుక్‌ తెస్తుంది.

మెహందీ( మైదాకు )

సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం బొట్టు. ఇప్పుడు టిక్లీలు ఫేమస్‌ అయ్యాయి కానీ, అప్పట్లో కుంకుమ లేదా తిలకం పెట్టుకొని అందంగా రెడీ అయ్యేవారు.

బొట్టు

Download Our  YouSay App

*ఉత్పత్తుల క్వాలిటీకి Yousay బాధ్యత వహించదు.  సరైన పరిశోధన చేసి  మీ అభిరుచికి తగ్గట్టుగా ఉంటేనే కొనండి.