హీరోయిన్లలా ట్రెండీ లుక్‌లో కనిపించాలనుకుంటున్నారా? ఇవి మీకోసమే
పండుగలు వస్తున్నాయంటే కొత్త దుస్తులు ధరించి సరికొత్తగా కనిపించాలని అనుకుంటారు. అందులోని మహిళలకు మరింత ఆసక్తి ఉంటుంది.
సంక్రాంతి సంబరాలు మరికొన్ని రోజుల్లో రానున్నాయి. మరి ట్రెండీ స్టైల్స్ గురించి తెలుసుకొని పండగ రోజుల్లో సూపర్బ్‌గా రెడీ అయిపోదామా!
బంగారు రంగు అంచు ఉన్న పింక్ కలర్ చీరపై నెక్లెస్, ఆర్నమెంట్స్ ధరిస్తే ఆ లుక్ అందర్ని ఆకట్టుకోక తప్పదు.
నయనతార
సింపుల్‌గా ఉండే బ్లాక్ అవుట్ ఫిట్స్ ధరించి పెద్దగా జువెలరీ పెట్టుకోకుండా కేవలం స్టైలిష్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే పండగకి కేక లుక్ వచ్చినట్లే.
కృతి శెట్టి
ఫుల్ లెంగ్త్ లైట్ పింక్ కలర్ బంగారు అంచు ఉన్న చీరలో సరికొత్త లుక్ చూపించవచ్చు. దీనికి ముత్యాలుండే టైప్ జువెలరీ తోడైతే అదిరిపోతుంది.
తమన్నా
పంజాబ్ స్టైల్ డ్రెస్సింగ్‌లో కుర్తా వేసి దానికి బడా జుమ్కీలు, దుస్తులకు తగిన గాజులు వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్
రాయల్ బ్లూ బెనారస్ చీరలో బంగారు రంగులో మోటిఫ్ కడ్వా వర్క్ ఉన్న చీరకి రా మ్యాంగో బ్లౌజ్ వేస్తే ట్రెడిషనల్ లుక్ వస్తుంది. దీనికి జువేలరీ మాములుగా ఉంటే సరిపోతుంది.