వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
YouSay Short News App
ఎన్నో అంచనాల మధ్య దళపతి విజయ్ నటించిన ‘వారిసు’ మూవీ ఈరోజు విడుదలైంది. వారసుడు పేరుతో తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా తొలుత తమిళంలో విడుదలైంది.
ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వంశీపైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగువారు. అలాగే జయసుధ, శ్రీకాంత్ వంటి తెలుగు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమా ఎలా ఉంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఒక వ్యాపారవేత్త తన ముగ్గురి కొడుకుల్లో అసలైన వారసుడిని ఎంపిక చేసుకునే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. రాజేంద్రన్(శరత్ కుమార్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్.
కథ
తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై(శ్రీకాంత్), అజయ్(శ్యామ్) విజయ్(విజయ్)లలో సమర్థుడైన ఒకరికి అప్పజెప్పాలని భావిస్తాడు.
కానీ తండ్రి విధానాలు నచ్చని విజయ్ ఇంటి నుంచి దూరంగా బయటకు వెళ్తాడు. ఛైర్మన్ కుర్చిని దక్కించుకోవాలని అజయ్, జై ప్రయత్నిస్తుంటారు.
మరి తన తెలివితో విజయ్ అసలైన వారసుడిగా ఎలా నిరూపించుకుంటాడు. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కూలదోయాలనుకున్న ప్రకాశ్ రాజ్‌కు ఎలా బుద్ధి చెబుతాడు.
తన ఇద్దరు సోదరుల్లో ఎలాంటి మార్పు తెస్తాడు. విడిపోతున్న కుటుంబాన్ని ఎలా నిలబెడుతాడు. రష్మికతో తన ప్రేమను గెలిపించుకుంటాడు అనేవి సినిమాలో చూడాల్సిందే.
‘రా తలైవా సాంగ్’తో విజయ్ మాస్ ఇంట్రడక్షన్ బాగుంది. ప్లాట్ గా రొటీన్ కథ అనిపించేలా మొదలవుతుంది. కుటుంబ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తూ సాగుతుంది.
ఎలా ఉందంటే?
ఫస్టాప్ సూపర్బ్. ఇంట్రవెల్‌లో చిన్న ట్విస్ట్. సెకండాఫ్ కొంచెం స్లో. మధ్యలో వచ్చే కుటుంబ సన్నివేశాలు. క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ ఓవరాల్‌గా అడ్జస్టబుల్ మీటరింగ్‌తో వెళ్తుంది.
విజయ్ తన ప్రత్యేక హ్యూమర్ నటనతో అదరగొట్టాడు. సెంటిమెంట్ సీన్లలో జీవించాడు. కామెడీ పంచ్‌లు బాగున్నాయి. రష్మిక తన నిడివి మేరకు నటించింది. ప్రకాష్ రాజ్, జయసుధ తమదైన నటతో మెప్పిస్తారు. కొద్దిసేపు కనిపించినా ఎస్ .జె సూర్య నటనతో ఆకట్టుకుంటాడు.
ఎవరేలా చేశారంటే..
వంశీ పైడిపల్లి తెలివైన పని చేశాడు. విజయ్ పాత బ్లాక్ బస్టర్ సినిమాలను గుర్తు చేస్తూ కొన్ని సీన్స్‌ను తీసుకొచ్చాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
సెకండాఫ్ లో కామెడీ, హీరోయిజంను కరెక్ట్ మీటర్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కాస్త ఓల్డ్ సినిమాగా అనిపిస్తుంది. రోమాంటిక్ ట్రాక్, విలన్ పాత్రల నిడివి ఇంకొంచెం పెడితే బాగుండేది.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. రిచ్ విజువల్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి.క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లు బాగున్నాయి. రష్మిక షోను మరింత అందంగా చూపించారు. ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. తమన్ అందించిన BGM సీన్లను ఎలివేట్ చేసింది.
సాంకేతికాంశాలు
మొత్తంగా మంచి కుటుంబ చిత్రం చూడాలనుకునేవారికి వారిసు మూవీ నచ్చుతుంది. మాస్, న్యూలవ్ స్టోరీ కావాలనుకునే వారికి పర్వాలేదు అనిపిస్తుంది.
చివరగా...
రేటింగ్: 3.0/5
విజయ్ నటనయోగిబాబుతో వచ్చే కామెడీ ట్రాక్కుటుంబ సన్నివేశాలుపాటలు
బలాలు
రొటీన్ కథకథను ముందే ఊహించే సీన్లుఫ్యాన్స్కు నచ్చే సీన్లకే ప్రాధాన్యం