YouSay Short News App

సింగర్ మంగ్లీపై నిజంగా రాళ్ల దాడి జరిగిందా? మంగ్లీ ఎం చెప్పిందంటే?

కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై దాడి జరిగిందన్న వార్తలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి.  మరి మంగ్లీపై కర్నాటకలో నిజంగానే దాడి జరిగిందా? మంగ్లీ ఏం సమాధానం చెప్పిందో ఓసారి చూద్దాం

గత రెండు రోజులుగా గాయని మంగ్లీపై దాడి జరిగిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  బళ్లారిలో కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని ప్రచారం జరిగింది.

కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్‌లోనూ జరిగిన  ఓ ఈవెంట్‌లో మంగ్లీ పాల్గొంది. ఆ కార్యక్రమం సందర్భంగా కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరింది.

అసలు ఎక్కడ మొదలైంది?

అందరికీ తెలుగు వస్తుందని తాను మాట్లాడనని మంగ్లీ చెప్పింది. యాంకర్ బలవంతం చేయడంతో కన్నడలో రెండు మాటలు మాట్లాడి వెనుదిరిగింది.

శనివారం బళ్లారిలో జరిగిన మరో ఇవెంట్‌కు మంగ్లీ హాజరైంది. ఈవెంట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో కొందరు అభిమానులు ఆమెను చూసేందుకు కారు వద్ద ఎగబడ్డారు. పోలీసులు నియంత్రించడంతో అభిమానులు వెనుదిరిగారు.

బళ్లారిలో జరిగింది ఇది!

ఈ వీడియో వైరల్‌ కాగా మంగ్లీ తీరుపై కన్నడ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడలో ఆమెకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారంటూ కామెంట్ చేశారు.

నెటిజన్ల ఆగ్రహం

తనపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలన్నీ పూకార్లేనని మంగ్లీ కొట్టిపారేసింది. ఈ వార్తలపై  సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

మంగ్లీ క్లారిటీ

అయితే ఈ ఘటనను కావాలనే కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవదని కోరింది.

కన్నడ ప్రజలను తనపై చూపిన ప్రేమను మరవలేనని.. ఆ ప్రోగ్రామ్‌ ఎలా జరిగిందో ఫొటోలు, వీడియోలను చూస్తేనే  అర్ధమవుతోందని చెప్పింది.

కన్నడ ప్రజల ప్రేమ గొప్పది