WATER METRO: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు!

YouSay Short News App

దేశంలో మెుట్టమెుదటి వాటర్ మెట్రో రాబోతుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టూరిజం అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకువచ్చారు.

కేరళలోని కొచ్చిలో మెుదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభిస్తారు. దీనిని దేశానికి అంకితం చేయనున్నారు.

కేరళలో మరో కీలకమైన ఘట్టానికి సమయం ఆసన్నమయ్యింది. ప్రత్యేకమైన పట్టణ రవాణా వ్యవస్థ అయిన వాటర్ మెట్రో ప్రారంభం కానుంది. సాధారణ మెట్రో వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది.

మరో అద్భుతం

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 1,136.83 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొచ్చి సమీపంలోని దాదాపు 10 దీవులను కలుపుకొని మెట్రో వెళ్తోంది.

ఖర్చు ఎంతంటే?

ప్రపంచమే నివ్వెరపోయే విధంగా వాటర్ మెట్రో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టర్నినల్స్ సిద్ధం చేస్తారు.

ఎన్ని బోట్లు

మెుదటి దశలో భాగంగా హైకోర్ట్‌-విపిన్ టర్మినల్‌ నుంచి వైట్టిలా కాకినాడ టర్మినల్స్‌ మధ్య నడుస్తోంది.

ఎక్కడ్నుంచి ఎక్కడికి.

కేరళ ప్రభుత్వంతో పాటు జర్మన్ బ్యాంక్ సహకారంతో ప్రాజెక్టు చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా జాలీగా వెళ్లవచ్చు.

సాఫీ ప్రయాణం

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వాటర్ మెట్రోను తీసుకువచ్చింది సర్కారు. సాధారణ మెట్రోలో వెళ్లేవారు వారీ వద్ద ఉన్న కార్డుతో వాటర్ మెట్రోలో కూడా ప్రయాణించవచ్చు.

సౌలభ్యాలు

వాటర్ మెట్రో టికెట్ కనీస ధర రూ. 20. వీక్లీ,  నెలవారీ  పాసులు కూడా జారీ చేస్తున్నారు.

పాసులు

మెట్రో నగరాల్లో రోజురోజుకి రద్దీ పెరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు రవాణా సౌకర్యాలు పెంచుతున్నాయి.

రద్దీ దృష్ట్యా

అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఇలాంటి వాటర్ మెట్రో వంటి సౌకర్యాలు తీసుకువస్తున్నాయి ప్రభుత్వాలు. ఇవి మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.

దండిగా ఆదాయం

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.