రష్యా అధ్యక్షుడు  పుతిన్‌కు ఏమయ్యింది ?

YouSay Short News App

ఉక్రెయిన్, రష్యా యుద్ధం మెుదలైన తర్వాత పరిచయం అక్కర్లేని పేరు వ్లాదిమిర్ పుతిన్. మాస్కో అధ్యక్షుడిగా దీర్ఘకాలిక సేవలందిస్తున్న ఆయన ఆరోగ్యం పట్ల కొన్నేళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

క్యాన్సర్‌ ఉందని…నరాల అస్వస్థతని. చేతులు ఊదా రంగులోకి మారాయని..కనీసం షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం లేదని ఇలా ఒక్కటేంటి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనం అవుతుంది. అసలు పుతిన్‌కు ఏం జరిగింది ? అతడికి క్యాన్సర్‌ ఉన్న మాట వాస్తవమేనా ? వీటన్నింటికి సమధానం ఇదే.

పుతిన్ కేజీబీలో సీక్రెట్ ఏజెంట్‌గా ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్ని ఏళ్లుగా రష్యాకి సేవలందిస్తున్న పుతిన్‌ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.

పుతిన్‌ ప్రస్థానం

సంచలన నిర్ణయాలతో ప్రజల్లో మన్నన పొందారు. దేశ రక్షణలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్‌తో యుద్ధమే ఇందుకు ఉదాహరణ.

పుతిన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు కాదు దాదాపు 13 ఏళ్లుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఆయనకు క్యాన్సర్‌ ఉందని 2009లోనే ప్రచారం జరిగింది. అంతేకాదు, గుట్టుచప్పుడు కాకుండా ఆపరేషన్ చేశారని సమాచారం. కానీ, అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు.

ఆరోగ్య పరిస్థితి

ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. ఇందుకు అనారోగ్యమే కారణమని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

తెరపైకి మరోసారి

సరిగా నిలబడలేకపోవటంతో పాటు షేక్ హ్యాండ్‌ ఇస్తున్నప్పుడు వణుకుతున్న వీడియోలు మీడియాలో వచ్చాయి. మాస్కో అధ్యక్షుడు నరాల అస్వస్థతతో బాధపడుతున్నారని అన్నారు.

ఇప్పుడు మరోసారి పుతిన్ ఆరోగ్యం గురించి ప్రస్తావన వచ్చింది. రష్యాలో ఫ్లూ ప్రబలుతోందని ప్రచారం జరుగుతున్న వేళ జనావాసాలకు దూరంగా బంకర్‌లోకి వెళ్తున్నారట. వ్లాదిమిర్ భద్రతా సిబ్బందిలోనూ ఫ్లూ రావటంతో భయపడుతున్నారట.

పుతిన్ ఇటీవల ఓ సమావేశంలో పుతిన్ చేతులు ఊదా రంగులో ఉండటం కొందరు గమనించారు. ఆయన తీసుకునే చికిత్సల వల్లే చేతులు అలా మారాయని పలు కథనాలు వెలువడ్డాయి.

ఊదారంగు చేతులు,

అధ్యక్ష భవనంలో పుతిన్‌ మెట్లపై నుంచి కిందపడ్డాడని వార్త. ఎప్పటిలా కాకుండా కాస్త ఇబ్బంది పడుతూ నడుస్తున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. ఇది దెబ్బ తగలటం వల్ల కాదట.  కడుపులో ప్రేగుకు క్యాన్సర్ ఉండి మలవిసర్జన సమస్య ఉందని టాక్.

నడక మార్పు

పుతిన్ లైఫ్‌ స్టైల్‌ కూడా అనుమానాలు బలపరిచేందుకు ఓ కారణం. అతడు కొన్ని పనులు చేస్తుండటం ఇందుకు ఉదాహరణలు.

లైఫ్‌ స్టైల్‌

పుతిన్ ప్రతి రోజు జింక కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తాడని వినికిడి. ఫలితంగా క్యాన్సర్ తగ్గిపోతుందని తెలియటంతో అలా చేస్తున్నాడని తెలుస్తోంది. పుతిన్‌కు క్యాన్సర్  మెల్లిమెల్లిగా తగ్గటానికి జింక కొమ్ముల రక్తం కారణమని చాలామంది విశ్వసిస్తున్నారు.

జింక రక్తంతో స్నానం

ఎక్కడికి వెళ్లిన క్యాన్సర్ నిపుణులను వెంటపెట్టుకొని వెళ్తున్నారు. అంతేకాదు, 166 రోజుల్లోనే 35 సార్లు వైద్యుడిని అతడి నివాసంలో కలిశాడని ఓ కథనం వెలువడింది. అంటే, ఆరోగ్యం అంతలా క్షీణించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చుట్టూ వైద్యులే

అసలు ఇప్పటివరకు పుతిన్ ఆరోగ్యంపై వచ్చినవన్ని నిజాలేనా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్క విషయాన్ని అధికారికంగా ఎవ్వరూ ప్రకటించలేదు, ఖండించలేదు. పుతిన్‌ కూడా స్పందించలేదు.

నిజమా అబద్ధమా?

వీడియోలు, ఫొటోలు మాత్రం ఇది వాస్తవమేనని చెబుతున్నాయి. కానీ, కొందరు మాత్రం అలాంటిందేమి లేదని కొట్టిపారేస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.