మీర్జా‌మాలిక్‌ దంపతులకు ఏమైంది?

YouSay Short News App

సానియా ఇలా పోస్టులెందుకు పెడుతోంది?

గతకొంత కాలంగా సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇరువురి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.

విడిపోతున్నారా?

సానియా మీర్జా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఈ అనుమానాలకు ఊతమిస్తున్నాయి. వరుసగా ఈ టెన్నిస్ స్టార్ ఇలాంటి పోస్టులు చేస్తుండటంతో నిజమేనేమోనని పలువురు భావిస్తున్నారు.

సానియా పోస్టులు

‘విరిగిన మనసు ఎవరిని ఆశ్రయిస్తుంది.. ఆ దేవుడి(అల్లా)ని తప్ప’ అంటూ సానియా ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఈ స్టోరీని బట్టి సానియా మానసికంగా వేధనకు గురవుతున్నట్లు అర్థమవుతోంది.

‘మనసు విరిగింది’

తన కొడుకుతో సరదాగా ఉన్న ఫొటోని షేర్ చేస్తూ సానియా మరో పోస్టు పెట్టింది. ‘కష్టకాలంలో మనల్ని ముందుకు నడిపించే క్షణాలివే’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఈ ఫొటోలో సానియా హ్యాపీగా తన కుమారుడితో ఆడుకుంటోంది.

నువ్వే నా ఆనందం

ఇటీవల మీర్జామాలిక్ దంపతుల కుమారుడు ఇజాన్ పుట్టినరోజు వేడుకల్లో వీరిరువురు పాల్గొన్నారు. ఇజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ ఫొటోలను సానియా తన ఇన్‌స్టాలో షేర్ చేయలేదు.

ఇజాన్ బర్త్‌డే

షోయబ్ మాలిక్ తమ కుమారుడి పుట్టినరోజు వేడుకల ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఫొటోలకు భావోద్వేగ సందేశాన్ని జోడించాడు.

ఇన్‌స్టాలో షోయబ్

‘మేమిద్దరం ఒకేచోట లేకపోయినా.. నేనెప్పుడూ ఆలోచించేది నీ గురించే ఇజాన్. నీ సంతోషాన్నే కదా నేను కోరుకునేది. నువ్వు మా జీవితంలోకి వచ్చాక మరింత విధేయులుగా మారాం’ అంటూ రాసుకొచ్చాడు.

ఒకచోట లేకపోయినా..

గత కొద్ది కాలంగా సానియా, షోయబ్‌లు విడిగా ఉంటున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షోయబ్ చేసిన పోస్టు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

విడిగా జీవనం?

షోయబ్ ఓ మోడల్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పాక్ మీడియా కోడై కూస్తోంది. అందుకే సానియాను షోయబ్ పట్టించుకోవట్లేదట.

ఆమేనా కారణం?

యూట్యూబర్ అయేషా ఒమర్‌తో షోయబ్ ఇటీవల చేసిన ఓ ఫొటో షూట్ చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయేషా వల్లే సానియాను షోయబ్ దూరం పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫొటోషూట్..

స్టార్ కపుల్‌ విడాకులు నిజమేనని, వారు ఇప్పటికే వేరుగా ఉంటున్నారని మాలిక్‌ సన్నిహితుడొకరు చెప్పినట్లు పాక్‌ మీడియా రాసింది. కేవలం విడాకుల పత్రాల ప్రక్రియ మాత్రమే మిగిలుందని ఆతడు చెప్పాడట

నిజమేనంటున్న సన్నిహితులు

సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లది దేశాలు దాటిన ప్రేమ. 2010లో హైదరాబాదీ ముస్లిం సంప్రదాయ బద్ధంగా వీరిద్దరు ఒక్కటయ్యారు. 2018లో వీరికి కుమారుడు జన్మించాడు.

2010లో పెళ్లి..

తమ దాంపత్యంపై వస్తున్న వార్తలకు ఈ జంట స్పందించడం లేదు. ఇరువురు మౌనం పాటిస్తున్నారు. దీంతో ఈ వార్తలు ఒకింత నిజమే కావచ్చు అని అంతా అనుకుంటున్నారు. మరి ఇది ఎక్కడివరకు దారితీస్తుందో వేచి చూడాలి.

దంపతుల మౌనం..