Marital Rape అంటే ఏంటి?

YouSay Short News App

చట్టం ఏం చెబుతోంది?

‘వైవాహిక అత్యాచారం’(Marital Rape) తాజాగా ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. సెక్షన్‌ 375 ప్రకారం భార్యతో భర్త చేసే శృంగారం ‘రేప్‌’గా పరిగణించబడదు. కానీ దీనిపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లయినా, కాకున్నా మహిళ అనుమతి లేకుండా చేసే శృంగారం అత్యాచారమేనని అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై ఫిబ్రవరి 15లోగా కేంద్రం తమ స్పందన తెలపాలని సుప్రీం ఆదేశించింది.

అసలు ‘అత్యాచారం’ గురించి సెక్షన్‌ 375 ఏం చెబుతోంది. రేప్‌ను చట్టంలో ఎలా నిర్వచించారు. మినహాయింపులు ఏమున్నాయి. ఓసారి చూద్దాం

ఓ వ్యక్తి మహిళతో లైంగికంగా కలవడం గానీ లేదా వేరే వ్యక్తితో కలిసేలా చేయడం గానీ చేసినపుడు దానిని రేప్‌ అని చెప్పడానికి చట్టంలో కొన్ని నిర్వచనాలున్నాయి.

ఒక మహిళకు ఇష్టం లేకుండా ఆమెతో లైంగికంగా  పాల్గొంటే చట్ట ప్రకారం అది రేప్‌ అవుతుంది.

ఆమెకు ఇష్టం లేకుండా..

మహిళకు మీరంటే ఇష్టం ఉన్నా లేకున్నా లైంగిక చర్యకు ఆమె అనుమతి తీసుకోవాల్సిందే. ఆమె అనుమతి లేకుండా చేసే లైంగిక చర్యను అత్యాచారం గానే పరిగణిస్తారు.

ఆమె అనుమతి లేకుండా

అనుమతి తీసుకుని చేసినా కొన్నిసార్లు అది రేప్‌ అవుతుంది. ఎప్పుడంటే ఆ అనుమతి కోసం ఆమె ప్రాణాలకు గానీ, ఆమె ప్రేమించే ఇతరుల ప్రాణాలకు కానీ ముప్పు ఉంటుందని భయపెట్టి చేసినపుడు.

భయపెట్టడం ద్వారా

మహిళకు తన భర్తతోనే తాను శృంగారంలో పాల్గొంటోందని భ్రమ పెట్టి ఆమెతో లైంగిక చర్యకు పాల్పడితే అది రేప్‌ అవుతుంది.

భ్రమ పెట్టి

మానసిక స్థితి సరిగా లేకుండా ఇచ్చిన అనుమతిని అనుమతిగా పరిగణించరు. మత్తులో ఉన్నపుడు, తాను చేయబోయే పనివల్ల కలిగే పరిణామాలపై తనకు అవగాహన లేని సమయంలో సెక్స్‌కు మహిళ తెలిపే అంగీకారం చట్టం దృష్టిలో అంగీకారం కాదు

మానసిక స్థితి సరిగా లేనపుడు

అమ్మాయి వయసు 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నపుడు  అంగీకారం తీసుకుని చేసినా తీసుకోకుండా చేసినా అది రేప్‌ కిందకే వస్తుంది

వయసు

సెక్స్‌కు తన అంగీకారం చెప్పలేని స్థితిలో ఉన్న మహిళతో చేసే శృంగారం రేప్‌ అవుతుంది.

స్పృహలో లేనపుడు

ఓ మహిళ సెక్స్‌ను ప్రతిఘటించలేదంటే అంగీకరిస్తుందని కాదు. ఆమె ప్రతిఘటించకపోయినా అంగీకారం లేకుండా చేస్తే అది అత్యాచారమే.

వైద్యంలో భాగంగా మహిళ ప్రైవేట్‌ పార్ట్స్‌ను  తాకడం రేప్‌ కాదు.

మినహాయింపు

చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న భర్త భార్యతో చేసే సెక్స్‌ రేప్ కాదు. ప్రస్తుతం దీనిపైనే అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మినహాయింపు

కేంద్రప్రభుత్వ స్పందన అనంతరం మార్చి 21 తర్వాత ‘మారిటల్ రేప్‌’పై వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణ జరపనుంది.