2023లో మోస్ట్‌ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్‌ ఇండియా పాస్‌పోర్ట్‌ స్థానమెంత?

YouSay Short News App

విదేశీ యాత్ర చేయాలంటే పాస్‌పోర్ట్‌, వీసా తప్పనిసరి. కానీ కొన్ని దేశాల పాస్‌పోర్ట్‌ ఉంటే వీసా లేకుండానే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. ఆ పాస్‌పోర్ట్‌ అంత పవర్‌ఫుల్‌. హెన్లీ సంస్థ 2023 ఏడాదికి పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది.

అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటాతో 199 దేశాలతో కూడిన జాబితాను హెన్లీ ప్రకటించింది. అందులో టాప్‌ 10లో దేశాలేవి? ఇండియా స్థానమెంత చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ జపాన్‌దే. ఈ పాస్‌పోర్ట్‌తో ఏకంగా ప్రపంచంలోని 193 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు.

తొలి స్థానం

రెండో స్థానంలో సింగపూర్‌, దక్షిణ కొరియా రెండూ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 192 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

రెండో స్థానం

మూడో స్థానంలో జర్మనీ, స్పెయిన్‌ దేశాలనున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 190 దేశాల్లో వీసా లేకుండా తిరగొచ్చు.

మూడో స్థానం

నాలుగో స్థానంలో ఫిన్లాండ్‌, లక్సెంబర్గ్, ఇటీలీ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 189 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు.

నాలుగో స్థానం

ఐదో శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్న దేశాలుగా ఆస్ట్రియా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌  ఉన్నాయి. వీటితో 188 దేశాల్లో వీసా లేకుండా పర్యటనకు వెళ్లవచ్చు.

ఐదో స్థానం

ఫ్రాన్స్‌, ఐర్లాండ్, పోర్చుగల్‌, యూకే దేశాలు ఆరో స్థానంలో ఉన్నాయి. వీటి పాస్‌పోర్ట్‌తో 187 దేశాల్లో పర్యటించవచ్చు.

ఆరో స్థానం

బెల్జియం చెక్‌ రిపబ్లిక్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా ఏడో స్థానంలో ఉన్నాయి.  ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.

ఏడో స్థానం

ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా దేశాలు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 185 దేశాలకు వెళ్లవచ్చు.

ఎనిమిదో స్థానం

పోలండ్‌, హంగేరీ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాయి. వీటి పాస్‌పోర్ట్‌తో 184 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.

తొమ్మిదో స్థానం

లిథువేనియా, స్కోకేవియా దేశాలు ఈ జాబితాలో పదో స్థానం దక్కించుకున్నాయి. 183 దేశాలకు వీటి పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా వెళ్లవచ్చు.

పదో స్థానం

పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఇండియా స్థానం 85. ఇండియా పాస్‌పోర్ట్‌తో కేవలం 59 దేశాల్లో వీసా లేకుండా పర్యటనకు వెళ్లవచ్చు. 2022లో  ఈ సంఖ్య 60గా ఉండేది.

ఇండియా

అత్యంత బలహీన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న దేశం అఫ్గానిస్తాన్‌. చివరి పది స్థానాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్‌ ఉన్నాయి.

అత్యంత బలహీనం