చిన్న చిన్న పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటి కల్పిక గణేశ్. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.
అటు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతుంది.
ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి వివాదాలకు తెరతీసింది. హీరోయిన్ ధన్యా బాలకృష్ణతో గొడవ, ఇన్‌స్టాలో రచ్చ. మరి ఇంత ట్రెండింగ్‌లో ఉన్న ఆమె గురించి తెలియనివారుంటే తెలుసుకోండి మరి.
మంచు మనోజ్ ప్రయాణం సినిమా గుర్తుందా. అందులో హీరోయిన్ పాయల్ గోష్ స్నేహితురాలిగా కల్పిక ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆరేంజ్‌లోనూ జెనిలియా ఫ్రెండ్స్‌లో ఒకరిగా అవకాశం దక్కించుకుంది.
కల్పిక పరిచయం
సహాయ పాత్రల్లో నటనకు గుర్తింపు లభించటంతో ఆఫర్లు క్యూ కట్టాయి. జులాయిలో రాజేంద్ర ప్రసాద్ కుమార్తెగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో గీతగా మెప్పించింది.
వరుస సినిమాలు
నమో వెంకటేశ, సారొచ్చారు, పడిపడి లేచే మనసు వంటి ఎన్నో సినిమాల్లో ఈ అమ్మడు మెరిసింది.
సినిమాల్లోకి రాకముందు కల్పిక మోడల్. వివిధ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. అంతేకాదు, దర్శకత్వ విభాగంలోనూ పనిచేసిన అనుభవం ఈమె సొంతం.
మోడలింగ్ టు మూవీస్
పర్ఫెక్ట్ కాపీ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించి మంచి మార్కులే తెచ్చుకుంది.
సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించిన కొద్దిరోజుల తర్వాత కల్పిక కూడా తనకు అలాంటి వ్యాధి ఉందని చెప్పింది.
సమంత లాంటి వ్యాధి
ఆమె ఆస్పత్రిలో బెడ్‌పైన ఉన్న ఫోటోలు ట్రెండ్ అయ్యాయి.
ఈ మధ్య వివాాదాలతో వార్తల్లో నిలుస్తోంది కల్పికా గణేశ్. ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆమె.. ధన్య బాలకృష్ణపై ఓ వీడియో చేసింది.
ఇప్పుడు ఏమయ్యింది?
అందులో ఆమె రహస్యంగా ఓ కోలివుడ్ ఫేమ్ బాలాజీని పెళ్లి చేసుకుందని చెప్పటంతో వివాదం షురూ అయ్యింది.
ఆ వీడియో కాస్త కొద్దిరోజులకు యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.
నాతో పెట్టుకుంటే భస్మమే
ధన్య తన పరపతి ఉపయోగించి వీడియే తీసివేయించడంతో పాటు తనను కాల్స్‌తో వేధించిందంటూ ఆరోపించింది కల్పిక.
తనతో పెట్టుకుంటే భస్మం చేస్తానంటూ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో సంచలనం అయ్యింది.
ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. తర్వాత ట్విటర్ వేదికగా కల్పిక పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి.
రచ్చ రచ్చ
అందులో వాళ్లకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ చూడకూడని, వినకూడని పదాలే వాడుతుంది మరి. ఈ వివాదానికి ఎక్కడ తెరపడుతుందో చూడాలి.
ఇప్పటికే సినిమాల పరంగా అవకాశాలు కల్పికకు తగ్గాయని వినికిడి.
కెరీర్‌పైనా ఎఫెక్ట్
ఆమె కూడా సినిమాల్లో పాత్రలు వద్దు అది కాకుంటే వేరే పని చేసుకుంటానంటూ వివాదాస్పదంగా మాట్లాడారు.