కృతి సనన్ కాదట!

YouSay Short News App

మరి ప్రభాస్‌ అసలైన ప్రేయసి ఎవరో!

ఆరడుగుల అందం. వందల కోట్ల ఆస్తి. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ. అందుకే మరి ప్రభాస్‌ ఇప్పుడు తెలుగు అబ్బాయిల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌!

41 ఏళ్ల ఈ అందగాడికి బాహుబలి తెచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాల తర్వాత  ఏకంగా 6000 పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో తెలుసుకోవచ్చు

ఇప్పటిదాకా ప్రభాస్‌ ఏ సంబంధాన్నీ ఓకే చేయలేదు. కానీ సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ ప్రేమ పెళ్లిపై పుట్టుకొచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్‌ పక్కన నిలబడితే జోడీ బాగుంటే చాలు పుకార్లు అల్లేస్తున్నారు

కృతి సనన్‌తో ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడని ఇటీవల అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ టైంలో ప్రభాస్‌ కృతికి ప్రపోజ్‌ చేశాడని, అందుకు కృతి కూడా ఒప్పుకుందని వార్తలు రాసుకొచ్చారు

ప్రభాస్‌ - కృతి సనన్‌

ఓ టీవీ షోలో వరుణ్ ధావణ్‌ కృతి పేరు ఒకరి మనసులో ఉందని, అతడు ముంబయి వాడు కాదని, ప్రస్తుతం దీపికా పదుకొణెతో షూటింగ్‌లో ఉన్నాడంటూ పరోక్షంగా ప్రభాస్‌ పేరును చెప్పడంతో ప్రభాస్‌-కృతి ప్రేమ వ్యవహారం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని ఫిక్స్‌ అయ్యారు

ఇంతలో ‘నా పెళ్లి డేట్ కూడా చెప్పకముందే …’ అంటూ కృతి కుండ బద్దలుకొట్టింది. అవన్నీ ఉత్త మాటలేనని తాము ప్రేమలో లేమని స్పష్టం చేసింది. తమ భేడియా కొంచే శృతి మించిందంటూ ఆమె ఇన్‌స్టాలో క్లారిటీ ఇచ్చింది

పెళ్లి డేట్‌ కూడా

కృతి రూమర్‌ కొత్తదే కావొచ్చు కానీ ప్రభాస్‌ రిలేషన్‌షిప్‌పై గతంలోనూ అనేక రూమర్లు ఉన్నాయి. అందులో కొన్ని అయితే ప్రభాస్‌ను వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి

ప్రభాస్‌ పెళ్లి విషయంలో ఎక్కువగా వినిపించి పేరు మాత్రం స్వీటీదే. ఇప్పటికీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ పోస్టులు పెడుతుంటారు. వీరిద్దరూ కలిసి ఉండే వీడియోలకు చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఎన్నో ఎడిట్‌లు మనకు సోషల్‌ మీడియాలో కనిపిస్తాయి

ప్రభాస్‌ - అనుష్క

ప్రభాస్‌-అనుష్క జంట తెరపై ఎంత చక్కగా ఉంటుందో నిజ జీవితంలోనూ అంతే చక్కగా ఉంటుంది. కానీ వీరిద్దరి బంధం ఏమిటనేది సన్నిహితులు కూడా సరిగా చెప్పలేరు. వీరి బంధం ‘స్నేహానికి మించినది కానీ ప్రేమ కాదు’ అలా ఉంటాయి వారి సమాధానాలు. ప్రభాస్‌, అనుష్క కూడా ఇప్పటిదాకా ఈ రూమర్లపై పెదవి విప్పలేదు

ఇలియానా కెరీర్‌ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నపుడు వచ్చిన సినిమా ‘మున్నా’. అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కాలక్రమంలో కనిపించకుండా పోయాయి. ఇలియానా కూడా వేరే వ్యక్తితో డేటింగ్‌ చేసి విడిపోయింది

ప్రభాస్‌ - ఇలియానా

మిగతా రూమర్లన్నీ ప్రభాస్‌కు పెద్దగా ఇబ్బంది కలిగించేవి కాకపోయినా షర్మిలతో బంధంపై వచ్చిన పుకారు మాత్రం ఆయనను వ్యక్తిగతంగా సమస్యగా మారింది. అప్పటికే పెళ్లైన షర్మిలతో ప్రభాస్‌కు వివాహేతర సంబంధాన్ని అంటగట్టారు.

ప్రభాస్‌ - షర్మిల

ఈ పుకార్లపై YS షర్మిల అప్పట్లో తీవ్రంగా స్పందించారు. రాజకీయాల కోసం తన వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారంటూ మండిపడింది. ప్రభాస్‌ను కనీసం తాను కనీసం ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదని స్పష్టం చేశారు.

ప్రభాస్ పెళ్లి విషయం దివంగత కృష్ణం రాజు వద్ద ప్రస్తావన వచ్చినప్పుడు సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు. వీరిది పశ్చిమ గోదావరి జిల్లా మెుగల్తూరు కావటంతో ఆ జిల్లా నుంచే సంబంధాలు చూశారని టాక్ వచ్చింది. ఇదిగో అమ్మాయి, అదిగో పెళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి జరిగింది. కొంతకాలానికి ఆ చర్చ కాస్తా అటకెక్కింది.

ప్రభాస్ - ప.గో జిల్లా చిన్నది

ప్రభాస్‌పై ఎన్నో పుకార్లు వచ్చాయి కదా మరి అసలు ప్రభాస్‌ క్రష్‌ ఎవరో తెలుసా! బాలివుడ్ బ్యూటీ రవీనా టాండన్. ‘అందాజ్‌ అప్నా అప్నా’ సినిమాలోని ‘యే లో జీ సనమ్‌’ పాట వింటే ఇప్పటికీ మైమరచిపోతానంటాడు. ‘రవీనా నా ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ అని సరాదాగా చెబుతుంటాడు

ప్రభాస్‌ క్రష్‌ మాత్రం ఆవిడే