YouSay Short News App

గూగుల్‌ని షేక్ చేసిన  ఈ సోషల్ మీడియా స్టార్ ఎవరు?

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన  వ్యక్తుల జాబితాలో సోషల్ మీడియా సెన్సేషన్ అంజలి ఆరోరా ఒకరు.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన  వ్యక్తుల జాబితాలో సోషల్ మీడియా సెన్సేషన్ అంజలి ఆరోరా ఒకరు.

టాప్ 10 వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సోషల్ మీడియా స్టార్.. అంజలి ఆరోరా

భుబాన్ బద్యాకర్ పాడిన ‘కచ్చా బాదం’ పాటకు కాలు కదిపి ఈ 22 ఏళ్ల దిల్లీ చిన్నది రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

కొద్ది రోజుల్లోనే అంజలీ ఆరోరాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 10మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సొగసరికి 12.2మిలియన్  ఫాలోవర్లు ఉన్నారు.

టీవీ రియాలిటీ షో ‘లాకప్’లో కంటెస్టెంట్‌గా చేరడంతో ఈ క్రేజీ బ్యూటీకి దేశమంతా  పాపులారిటీ వచ్చేసింది.

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీతో షోలో స్నేహ పూర్వకంగా మెలగడంతో మీడియా దృష్టిని ఆకర్శించి వార్తల్లో నిలిచింది.

సన్నిహితుడు, డిజిటల్ క్రియేటర్ అయిన ఆకాశ్ సాన్‌సాన్వాల్‌తో ఎంతోకాలంగా అంజలి ఆరోరా రిలేషన్‌షిప్‌లో ఉంది.

పంజాబీ సింగర్ జాస్ మనక్‌కి అంజలి వీరాభిమాని. సింగర్ కాకాతో చేసిన ‘టెంపరరీ ప్యార్ బై’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో ఏకంగా 400మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

అంజలి ఆరోరా సొగసైన పోజుల్లో కొన్ని..

అంజలి ఆరోరాకి సంగీతమంటే ఇష్టం.  బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఇలా సంగీతాన్ని ఆస్వాదిస్తోంది.

చల్లని వెన్నెలలో కూర్చుంటే ఆ అనుభూతే వేరు. ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తోంది.

నిజాయితీగా ఉండాలంటూ కొత్త కారుతో  దిగిన ఫొటో ఇది.

ఇలా మినీ స్కర్ట్, బ్లూ టాప్ వేసుకుని సెల్ఫీ తీసుకుంటూ మురిసిపోతోంది

ఎర్రటి డ్రెస్సులో ఆరోరా మరింత హాట్‌గా కనిపిస్తోంది

కార్లు, బైక్‌ల చుట్టూ ఉన్నప్పుడు కెమెరాకు పనిచెప్పకుండా ఉండదు.

తెలుపు, గులాబీ సల్వార్‌లో ఆధ్యాత్మికతతో మరింత అందంగా కనిపిస్తోంది.

ఓరి దేవుడా.. అందానికే అసూయ పుట్టించేలా ఉంది కదూ..!

అందంతో పాటు ఫిట్‌నెస్‌లోనూ ఈ బ్యూటీ  తగ్గేదే లే అంటుంది.

సముద్రపు తీరాన అలా నీలి రంగు దుస్తుల్లో మోకాళ్లపై కూర్చొని పోజులిస్తోంది.

మాల్దీవుల్లో ఈ బ్యూటీ ఫొటోకి పోజులిచ్చిందిలా.