ఇండియాలో సహజీవనం(Live in relationship)లు ఎందుకు పెరుగుతున్నాయి?
YouSay Short News APP
ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ప్రకారం దేశంలో దాదాపు 80 శాతం మంది యువత లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌నకు ప్రాధాన్యమిస్తున్నారు.
అయితే ఇందులో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
గతంతో పోలిస్తే ఈతరం యువతలో కెరీర్, జీవితం పట్ల దృష్టి కోణం మారింది. ఒకప్పుడు పెళ్లంటే లైఫ్‌లో సెటిల్ అవ్వడం లేదా స్థిరత్వం పొందడం అనే ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు వివాహం తమ ఎదుగుదలకు అడ్డుగా భావిస్తున్నారు.
కెరీర్:
యువతలో ముందుచూపు ఎక్కువైంది. విడిపోవడం గురించి ముందే ఆలోచిస్తున్నారు. వివాహబంధంలో విడాకులు తలనొప్పి వ్యవహారం. కానీ లివ్‌ఇన్‌లో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని చెరో దారి చూసుకోవచ్చు.
ముందు చూపు:
పెళ్లి అయినా, లివ్ ఇన్ అయినా ఇద్దరు కలిసి జీవించడం కోసమే. అలాంటప్పుడు కేవలం సమాజం కోసం పెళ్లి చేసుకుంటే మా అస్తిత్వం ఎక్కడుంటుంది అని భావిస్తున్నారు.
సమాజం కోసమే పెళ్లి
పెళ్లిలో బాధ్యతలు ఎక్కువ, అలాగే అనేక విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. స్వేచ్ఛగా బతకాలనుకునే యువతకు ఇది నచ్చట్లేదు.
బాధ్యతలు, సర్దుకుపోవడం:
వైవాహిక బంధంలో సామాజిక ఒత్తిళ్లు చాలా ఎక్కువ. పెళ్లి ఆ వెంటనే పిల్లలు, వారి చదువు అన్నీ సమాజం మీద ఆధారపడి తీసుకునే నిర్ణయాలే.
సామాజిక ఒత్తిళ్లు:
గతంతో పోలిస్తే తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే అమ్మాయిలు పెరిగారు. వైవాహిక బంధంలో పురుషాధిక్యత ఉంటుంది. అదే లివ్ ఇన్‌లో ఇద్దరూ సమానమనే భావన ఉంటుంది. ఇది అమ్మాయిలను లివ్ ఇన్ వైపు ఎక్కువగా తీసుకెళ్తోంది.
అమ్మాయిల్లో ఆర్థిక స్వావలంబన :
వైవాహిక బంధంలో ఆర్థిక బాధ్యతలు పురుషుడికి, ఇంటి, వంట పని మహిళకు అన్నట్లు ఉంటుంది. కానీ లివ్ ఇన్ రిలేషన్‌లో ఇద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకుంటారు.
ఆర్థిక స్వేచ్ఛ:
దీనివల్ల పురుషులు ఆర్థికంగా సేఫ్‌గా ఫీలయితే, మహిళలు సమానత్వం పొందిన భావన పొందుతున్నారు.
సమాజంలోని అసమానతలు కూడా లివ్‌ఇన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నపుడు, కులం,మతం కారణంగా పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు.
సామాజిక అంతరం:
అలాంటి సమాజంతో మాకేంటి? అని యువత లివ్‌ఇన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.